News February 24, 2025

కామారెడ్డి: CM రేవంత్ రెడ్డిని సన్మానించిన డీసీసీ అధ్యక్షుడు

image

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార నిమిత్తం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నిజామాబాద్ పట్టణానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు పూలబొకేను ఇచ్చి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, జిల్లా నాయకులు ఉన్నారు.

Similar News

News February 24, 2025

NTR టూడే టాప్ న్యూస్

image

*విజయవాడలో వ్యభిచార గృహం పై పోలీసుల దాడి *పెనమలూరులో నడిరోడ్డులో వృద్ధుడిపై యువకులు దాడి *అసెంబ్లీ నుంచి వచ్చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు*విజయవాడ: కస్టడీకి వల్లభనేని వంశీ * వైసీపీకి ప్రతిపక్ష హోదా లేదు: పవన్ కళ్యాణ్*మైలవరంలో దళిత సంఘాల ఆందోళన*కంకిపాడులో విజయవాడ యువకులు అరెస్ట్ *మద్యానికి బానిసై ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య *వంశీకి మంచం సౌకర్యం కల్పించాలి

News February 24, 2025

MBNR: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మూసాపేట్ మండల పరిధిలోని గాజులపేట సమీపంలో జాతీయ రహదారిపై కొత్తకోట, మదనాపూర్ గ్రామాలకు చెందిన చరణ్ (25), అనిల్ (22) బైక్‌పై హైదరాబాద్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో గాజులపేట సమీపంలో రహదారిపై వంతెన గోడకు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. ఘటన స్థలాన్ని భూత్పూర్ సీఐ రామకృష్ణ పరిశీలించారు.

News February 24, 2025

కామారెడ్డి: కొత్త డైట్ మెనూ ప్రకారం భోజనం అందించాలి: కలెక్టర్

image

ప్రభుత్వం ప్రకటించిన కొత్త డైట్ మెనూ అమలు పరచాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వసతి గృహాలు, రెసిడెన్షియల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫుడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన కొత్త డైట్ మెనూ ప్రకారం భోజనం అందించాలని తెలిపారు.

error: Content is protected !!