News April 1, 2025
కామారెడ్డి: WOW.. రాయిని చీల్చి.. వృక్షంగా ఎదిగి!

ప్రకృతి అంతులేని శక్తికి నిదర్శనంగా నిలిచే ఒక అద్భుతమైన దృశ్యం నిజాంసాగర్ శివార్లో కనిపించింది. నిశ్చలంగా కనిపించే ఒక పెద్ద బండరాయిని చీల్చుకుంటూ ఓ మొక్క మొలకెత్తి, నేడు ఎదిగి వృక్షంగా మారింది. ఏది ఏమైనప్పటికీ, ఈ రాయిని చీల్చుకుని ఎదిగిన వృక్షం మనందరికీ ఒక గొప్ప సందేశాన్నిస్తోంది. అడ్డంకులు ఎంత పెద్దగా ఉన్నా, పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చనే స్పూర్తినిస్తోంది.
Similar News
News April 3, 2025
వనపర్తి: ఆరోగ్య నియమాల గోడపత్రికను విడుదల చేసిన కలెక్టర్

మిషన్ మధుమేహ కార్యక్రమంలో భాగంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు తమ జీవన విధానంలో పాటించాల్సిన నియమాలు, చేయకూడని పనుల గురించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన గోడపత్రికను గురువారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఏ.శ్రీనివాసులు, ఎన్‌సీడీ రామచంద్రరావు, వైద్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
News April 3, 2025
HCU కంచ భూములపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

TG: కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల కొట్టివేతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు చెట్లు నరికివేయొద్దని, భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన మధ్యంతర నివేదికపై విచారణ సందర్భంగా SC కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఇది చాలా సీరియస్ విషయం. చట్టాన్ని మీరు ఎలా చేతుల్లోకి తీసుకుంటారు’ అని CSపై ఆగ్రహిస్తూ ప్రతివాదిగా చేర్చింది.
News April 3, 2025
కేంద్ర మంత్రిని కలిసిన వరంగల్ ఎంపీ

వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని గురువారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు రహదారుల అభివృద్ధికి సహకరించాలని కోరారు. పలు ప్రాజెక్టులపై చర్చించి అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ వినతిపత్రం అందించారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆమె తెలిపారు.