News December 24, 2024
కామారెడ్డి: ఉద్యోగంలో చేరే లోపే విషాదం
HYD నానక్‌రాంగూడ వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో కామారెడ్డి జిల్లా దోమకొండకు చెందిన ఐరేని <<14964716>>శివాని<<>>(21) మృతిచెందిన విషయం తెలిసిందే. ఆదివారం నిజాంసాగర్ నవోదయలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళానానికి హాజరయింది. అయితే ఆమె ఇటీవలే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం సాధించారు. 4 నెలల్లో విధుల్లో చేరాల్సి ఉండగా ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది. కుటుంబీకులు ఆమె నేత్రాన్ని LV ప్రసాద్ కంటి ఆసుపత్రికి డొనేట్ చేశారు.
Similar News
News December 25, 2024
నిజామాబాద్ జిల్లా BJP కొత్త సారథులు ఎవరు?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో BJPని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం దృష్టిసారించింది. JANలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కొత్త సారథులను నియమించనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ BJPని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు నూతన అధ్యక్షులు ఎవరు అవుతారో వేచి చూడాలి. దీనిపై మీ కామెంట్?
News December 25, 2024
నిజామాబాద్‌లో 3 నెలల పసికందు మృతి
నిజామాబాద్‌లోని సుభాష్ నగర్ బాల్ రక్ష భవనంలో మంగళవారం 3 నెలల పసికందు మృతి చెందింది. గుర్తు తెలియని ఓ మహిళ సెప్టెంబర్ 15న జిల్లా ఆస్పత్రిలో పసికందుకు జన్మనిచ్చింది. శిశువు బరువు తక్కువగా ఉండటంతో చెత్త బుట్టలో పడేసి వెళ్లిపోయింది. గమనించిన వైద్యులు శిశువును శిశు గృహానికి తరలించి చికిత్స అందించారు. కాగా శిశువు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
News December 25, 2024
HYDలో రోడ్డుప్రమాదం.. కామారెడ్డి వాసి మృతి
సోమవారం HYDలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దోమకొండకు చెందిన శివాని(21) మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆమెను బైక్‌పై తీసుకెళ్లిన మహ్మద్‌నగర్ మండలానికి చెందిన వెంకటరమణారెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. కాగా వీరిద్దరు నిజాంసాగర్ నవదయలో ఈ నెల 22న పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.