News February 28, 2025
కామారెడ్డి ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ ఎదుట ఇద్దరు మావోయిస్టులు శుక్రవారం లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి గుర్రాల విజయ్ కుమార్ (36), ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌కి చెందిన సోడి బాలకృష్ణ ఎస్పీ ఎదుట లొంగిపోయారు. విజయ్.. హిడ్మా నాయకత్వంలోని CPI Maoist PLGA 1st బెటాలియన్‌లో 2022లో పార్టీ మెంబర్‌గా చేరారు. సోడి బాలకృష్ణ 2018లో చర్ల ఏరియా కమిటీ మలేషియా మెంబర్‌గా అరుణ్ DVC ఆధ్వర్యంలో చేరారు.
Similar News
News March 1, 2025
ప.గో జిల్లా TODAY TOP HEADLINES

✷భీమవరంలో కన్నుల పండుగగా సోమేశ్వర స్వామి తెప్పోత్సవం ✷ పేద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్: కేంద్ర సహాయ మంత్రి వర్మ ✷ బడ్జెట్ నిరుత్సాహపరిచేలా ఉంది: టీచర్ ఎమ్మెల్సీ గోపి మూర్తి ✷ రాయకుదురులో అగ్ని ప్రమాదం ✷ నరసాపురంలో గోవా మద్యం కేసులో నలుగురు అరెస్ట్✷ ఇరిగేషన్‌కు అధిక నిధులు: మంత్రి నిమ్మల ✷ ఆచంటలో కుంకుమ భరిణీల కోసం బారులు తీరిన జనం
News March 1, 2025
MHBD: ప్రైవేట్ కళాశాలల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలి: PDSU

మహబూబాబాద్ పట్టణంలోని ప్రైవేట్ కళాశాల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి బానోతు దేవేందర్ డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ.. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల వద్దకు ప్రైవేట్ కళాశాలల యజమాన్యం వెళ్లి విద్యార్థుల సమాచారం తీసుకొని వారి అనుమతి లేకుండా అడ్మిషన్లు చేసి ఫీజు కట్టాలని బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు. అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
News March 1, 2025
మహబూబ్ నగర్ జిల్లా నేటి ముఖ్యంశాలు

✓మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం.✓నేటితో ముగిసిన కుల గణన సర్వే.✓రాజాపూర్‌లో పోలీసులు రెవెన్యూ సిబ్బంది ఇసుక రీచ్‌లు ధ్వంసం.✓ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు గడువు పొడిగింపు. ✓దేవరకద్రలో రైలు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు.✓దేవరకద్ర: వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.✓భూత్పూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు.