News February 24, 2025

కామారెడ్డి: కొత్త డైట్ మెనూ ప్రకారం భోజనం అందించాలి: కలెక్టర్

image

ప్రభుత్వం ప్రకటించిన కొత్త డైట్ మెనూ అమలు పరచాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వసతి గృహాలు, రెసిడెన్షియల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫుడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన కొత్త డైట్ మెనూ ప్రకారం భోజనం అందించాలని తెలిపారు.

Similar News

News February 25, 2025

గంజాయి కేసులో పదేళ్ల జైలు శిక్ష: ఎస్పీ

image

గంజాయి కేసులో ముద్దాయిలకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ అనకాపల్లి 10వ అదనపు జిల్లా కోర్టు తీర్పును ఇచ్చినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. 2021 మే 20వ తేదీన అనకాపల్లి టౌన్ పరిధిలో 20 కేజీల గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి కోర్టు సోమవారం శిక్షను విధించిందని ఎస్పీ తెలిపారు.

News February 25, 2025

ALP: మహాశివరాత్రికి లడ్డూ ప్రసాదం రెడీ

image

అలంపూర్ లో వెలసిన బాల బ్రహ్మేశ్వర స్వామి, జోగులాంబ దేవి ఆలయాల్లో ఈనెల 26న జరిగే మహాశివరాత్రి వేడుకలకు ఆలయాలు సుందరంగా ముస్తాబు అయ్యాయి. స్వామి అమ్మవారి మహా ప్రసాదంగా భావించే లడ్డు ల కొరత రాకుండా భక్తుల సౌకర్యార్థం 20 వేల లడ్డులు తయారు చేయించినట్లు ఈవో పురందర్ కుమార్ సోమవారం తెలిపారు. శివరాత్రి వేడుకలకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు.

News February 25, 2025

అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీలపై కేసులు: విశాఖ జేసీ

image

గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్‌లు MRP కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం గ్యాస్ ఏజెన్సీలపై కేసులు నమోదు చేస్తామని విశాఖ జేసీ మయూర్ అశోక్ హెచ్చరించారు. గ్యాస్ ఏజెన్సీల డిస్ట్రిబ్యూటర్లతో సోమవారం ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. దీపం-2 పథకం కింద సిలిండర్ డెలివరీ చేసిన 48 గంటల్లోపు లబ్దిదారుల ఖాతాలో సబ్సిడీ జమ కావాలన్నారు.‌ కాని పక్షంలో డీలర్లను సంప్రదించారని లబ్ధిదారులను కోరారు.

error: Content is protected !!