News February 25, 2025
కామారెడ్డి: గురుకుల ప్రవేశ పరీక్షకు 97.34% హాజరు

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్షల నోడల్ అధికారి G.నాగేశ్వరరావు తెలిపారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 16 సెంటర్లు ఏర్పాటు చేయగా 97.34% శాతం హాజరు నమోదైందన్నారు. పరీక్షల్లో 7481 మంది విద్యార్థులకు గానూ 7282 మంది వచ్చారని పేర్కొన్నారు.
Similar News
News February 25, 2025
భువనగిరిలో మహిళా కానిస్టేబుల్ సూసైడ్

మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. భువనగిరిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరూకొలు గ్రామానికి చెందిన అనూష (26) భువనగిరిలో నివాసం ఉంటున్నారు. తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News February 25, 2025
వనపర్తికి సీఎం రాబోతున్నారు..!

వనపర్తికి మార్చి 2వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నట్లు వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఆరోజు రూ.1000 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి నియోజకవర్గంలో పర్యటించేందుకు సమయం ఇచ్చారన్నారు. ఎంపీ మల్లు రవి, ఒబెదుల్లా కోత్వాల్ తోపాటు కాంగ్రెస్ నాయకులు చింతలపల్లి జగదీశ్వర రావు తదితరులు సీఎంను కలిశారన్నారు.
News February 25, 2025
బూతులు, గొడవలకు వైసీపీ నేతలు పర్యాయపదాలు: పవన్

AP: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తుంటే YCP నేతలు ఇష్టారీతిగా ప్రవర్తించారని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘గవర్నర్ ప్రసంగాన్ని వాళ్లు బహిష్కరించడం బాధాకరం. MLAలు అందరికీ ఆదర్శంగా ఉండాలి. YCP నేతలు గొడవలు, బూతులకు పర్యాయపదాలుగా మారారు. చట్టాలు చేయాల్సిన వాళ్లే నియమాలు ఉల్లంఘిస్తే ఎలా? అసెంబ్లీలోనే ఇలా ప్రవర్తించిన వాళ్లు బయట ఇంకెలా ఉంటారో?’ అని సందేహం వ్యక్తం చేశారు.