News July 25, 2024
కామారెడ్డి: చిన్న మల్లయ్య హత్య కేసులో ముగ్గురి అరెస్టు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1721914946657-normal-WIFI.webp)
అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన చిన్న మల్లయ్య అనే వ్యక్తిని హత్య చేసి పూడ్చిపెట్టిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. సదాశివ నగర్ పోలీస్ స్టేషన్లో ఆయన వివరాలను వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆ ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆ ముగ్గురిపై పలు సెక్షన్లలో కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
Similar News
News February 7, 2025
NZB: మృత్యువులోనూ వీడని స్నేహం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738906894963_50139228-normal-WIFI.webp)
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ వద్ద నిన్న ఎదురెదురుగా <<15383679>>ఆటో, లారీ ఢీకొని<<>> మాక్లూర్‌కు చెందిన ఇద్దరు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈప్రమాదంలో మృతిచెందిన ఇంతియాజ్, వెల్డింగ్ పని చేసే ఫర్హాన్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు అని మృతుల బంధువులు తెలిపారు. కాగా ఫర్హాన్‌కు వివాహమవగా 3నెలల పాప కూడా ఉందన్నారు.మృత్యువులోనూ వారి స్నేహం వీడలేదని కన్నీటి పర్యంతమయ్యారు.గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News February 7, 2025
NZB: ఆస్తి పన్ను వసూలు చేయాలి: కమిషనర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738908406966_50139228-normal-WIFI.webp)
నిర్లక్ష్యం చేయకుండా నగరంలో ఆస్తి పన్ను వసూలు చేయాలని నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ఆదేశించారు. ఆయన నగరపాలక సంస్థ స్పెషల్ టీం ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, సపోర్టింగ్ సిబ్బందితో సమావేశమై ఆస్తిపన్ను విషయంలో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భారీగా పెండింగ్‌లో ఉన్న వారి నుంచి త్వరితగతిన పన్ను వసూలు చేసేలా చూడాలన్నారు.
News February 7, 2025
NZB: ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోండి: స్రవంతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738900521759_50139228-normal-WIFI.webp)
నిజామాబాద్ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆర్ఆర్బీ, ఎస్సెస్సీ, బ్యాంకింగ్ ఉద్యోగ పరీక్షలకు, ఫౌండేషన్ కోర్సులకు ఉచిత కోచింగ్ కోసం ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ అధికారిణి స్రవంతి కోరారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 9నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈనెల 12నుంచి 14వరకు ఉంటుందన్నారు. వివరాలకు 86390 02255ను సంప్రదించాలన్నారు.