News March 19, 2025
కామారెడ్డి: చేపల వలలో చిక్కుకొని జాలరి మృతి

చెరువులో చేపలు పడుతూ వ్యక్తి నీటిలో మునిగి చనిపోయిన ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం సిద్దపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. SI మహేశ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తోపారం బొర్రన్న చేపలు పట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. మంగళవారం చెరువులో చేపల వేటకు వెళ్లగా, ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని నీటిలో మునిగి చనిపోయాడని తెలిపారు. కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.
Similar News
News March 19, 2025
ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్షలకు ఆహ్వానం : డీఈవో రాము

జగిత్యాల జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 2025-26కు తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ రాము తెలిపారు. 7, 8, 9, 10వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం విద్యార్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. స్వీకరణకు చివరి తేదీ ఈనెల 20. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ఏప్రిల్ 21. పరీక్ష తేదీ 27.
News March 19, 2025
కౌలు రైతులకు రూ.100 కోట్ల రుణాలు ఇవ్వాలి: బాపట్ల కలెక్టర్

వ్యవసాయంపై ఆధారపడిన జిల్లాలోని రైతులకు బ్యాంకర్లు అధిక రుణ సౌకర్యం కల్పించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. బ్యాంకర్ల జిల్లా స్థాయి సమీక్షా సమావేశం బుధవారం బాపట్ల కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ప్రాధాన్యత రంగాలు, ప్రాధాన్యత లేని రంగాలకు రుణాల పంపిణీలో నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు నూరు శాతం చేరుకోవాలన్నారు. కౌలు రైతులకు రూ.100 కోట్ల రుణాలు ఇవ్వాలన్నారు.
News March 19, 2025
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!

ఇవాళ జరిగిన కేంద్ర క్యాబినెట్ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
✤ రూ.2 వేల కంటే తక్కువ లావాదేవీలకు (పర్సన్ టు మర్చంట్) యూపీఐ ఛార్జీలు ఉండవు
✤ అస్సాంలో రూ.10,601 కోట్లతో అమ్మోనియా, యూరియా ఫ్యాక్టరీ ఏర్పాటు
✤ మహారాష్ట్రలో రూ.4,500 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ హైవే
✤ గోకుల్ మిషన్‌కు రూ.3,400 కోట్లు.