News May 2, 2024

కామారెడ్డి జిల్లాలో 4,546 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

image

ఎన్నికల విధులు, ఇతర అత్యవసర విధులు నిర్వహిస్తున్న 4,546 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని KMR జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తెలిపారు. జుక్కల్ నియోజకవర్గంలో 1,081, ఎల్లారెడ్డిలో 1,298, కామారెడ్డి నియోజకవర్గంలో 2,167 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ వివరించారు.

Similar News

News October 1, 2024

నీట్ పరీక్షల్లో కామారెడ్డి విద్యార్థుల ప్రతిభ

image

ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో కామారెడ్డి పట్టణానికి చెందిన చెప్యాల సునైనరెడ్డి రాష్ట్ర స్థాయిలో 272వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచింది. అలాగే మరొక విద్యార్థిని సంజన రాష్ట్ర స్థాయిలో 4,148వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచింది. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, పలువురు అభినందించారు.

News October 1, 2024

అక్టోబర్ 8-10 వరకు కామారెడ్డి జిల్లాలో కేంద్ర బృందం పర్యటన

image

కామారెడ్డి జిల్లాలో అక్టోబర్ 8 నుంచి 10 వరకు జల శక్తి అభియాన్ కేంద్ర బృందం పర్యటిస్తుందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో నీటి సంరక్షణ, భూగర్భ జలాలు పెంచే పనులను అధికారులు పూర్తి చేసి నివేదికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

News September 30, 2024

కామారెడ్డి జిల్లా టాపర్‌గా పిట్లం యువతి

image

సోమవారం వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని మార్దండ గ్రామానికి చెందిన కోటగిరి మౌనిక జిల్లాలో మొదటి స్థానం సాధించింది. దీంతో ఆమెను తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు అభినందించారు. గ్రామీణ ప్రాంతంలో ఉంటూ జిల్లా మొదటి స్థానం సంపాదించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.