News March 10, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి TOP న్యూస్

* KMR జిల్లా SPగా బాధ్యతలు స్వీకరించిన రాజేశ్‌చంద్ర
* మంత్రుల వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్న జిల్లా అధికారులు
* KMR: ప్రజావాణికి 101 ఫిర్యాదులు
* KMR: అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణకు ఛాన్స్: కలెక్టర్
* జుక్కల్ MLA తోట లక్ష్మీకాంతరావు చిత్ర పటానికి పాలాభిషేకం
* కార్మికుల వేతనాలు సక్రమంగా చెల్లించేలా చర్యలు: MLA
* జిల్లా పంచాయతీ అధికారిగా మురళీ
* ‘షబ్బీర్ అలీకి MLCగా అవకాశం కల్పించాలి’
Similar News
News March 11, 2025
నటితో గిల్ డేటింగ్?

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్, టీవీ నటి అవ్‌నీత్ కౌర్ డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, ఆసీస్ సెమీస్ మ్యాచ్‌కు ఆమె హాజరవడంతో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. గతంలో గిల్, అవ్‌నీత్ కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. అవ్‌నీత్ కౌర్ గతంలో ప్రొడ్యూసర్ రాఘవ్ శర్మతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
News March 11, 2025
సంగారెడ్డి: ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్

8 మంది విద్యార్థులను అకారణంగా కొట్టినందుకు కంగ్టి కస్తూర్బా పాఠశాల నుంచి ఇద్దరిని విధుల నుంచి తొలగిస్తు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గణితం సీఆర్పీ సురేఖ, పీఈటీ రేణుకను విధుల నుంచి తొలగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విద్యార్థులను కొడితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 11, 2025
సంగారెడ్డి: పోలీసు అధికారులను హెచ్చరించిన ఎస్పీ

జిల్లాలో పోలీసు అధికారులు అంకితభావంతో పనిచేయాలని నూతన ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసులు ఉంటే వెంటనే పరిష్కరించేలా చూడాలని చెప్పారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు పాల్గొన్నారు.