News April 8, 2025

కామారెడ్డి జిల్లాలో మండుతున్న ఎండలు

image

జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలను అధికారులు వెల్లడించారు. జుక్కల్ 40.8 డిగ్రీలు, బీర్కూర్ 40.7, గాంధారి 40.5, దోమకొండ 40.4, డోంగ్లి 40.2, మద్నూర్, నస్రుల్లాబాద్ 40.1, కామారెడ్డి 40, నిజాంసాగర్, బిక్నూర్ 39.9, బాన్సువాడ 39.8, రామారెడ్డి, బిచ్కుంద, రాజంపేట, లింగంపేట్ మండలాల్లో 39.7, బిబిపేట్, పిట్లంలో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు.

Similar News

News April 19, 2025

బైడెన్ US చరిత్రలోనే వరస్ట్ ప్రెసిడెంట్: ట్రంప్

image

బైడెన్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ట్రంప్ వివాదాస్పద పోస్ట్ చేశారు. ఓపెన్ బోర్డర్‌ రూపంలో బైడెన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల మంది క్రిమినల్స్‌ను అమెరికాలోకి రానిచ్చారని ఆరోపించారు. వారిలో హంతకులు, డ్రగ్ డీలర్స్, పిచ్చాస్పత్రుల నుంచి వచ్చిన వారే అధికంగా ఉన్నారన్నారు. వారిని దేశం నుంచి వెళ్లగొట్టడమే తన పని అని, అందుకే తనని ఎన్నుకున్నారని తెలిపారు. బైడెన్ US చరిత్రలోనే వరస్ట్ ప్రెసిడెంట్ అని ఫైరయ్యారు.

News April 19, 2025

ALERT: నేడు భారీ వర్షాలు

image

AP: నేడు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, తూర్పుగోదావరి, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.

News April 19, 2025

మల్లాపూర్: చెరువులో పడి బాలుడి గల్లంతు

image

మల్లాపూర్ మండల శివారులోని లింగన్నచెరువులో శుక్రవారం బాలుడు గల్లంతైనట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పుట్ట రాజేశ్(13) చెరువులోకి స్నానానికి వెళ్ళి గల్లంతైనట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చెరువు ఒడ్డున బాలుడి దుస్తులు, చెప్పులు ఉండటంతో పొలీసులకు సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్ళతో చెరువులో వెతికిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!