News March 31, 2025
కామారెడ్డి జిల్లాలో మండుతున్న ఎండలు

కామారెడ్డి జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఆదివారం ఉష్ణోగ్రత వివరాలను అధికారులు వెల్లడించారు. బిచ్కుంద మండలంలో అత్యధికంగా 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత, నస్రుల్లాబాద్ రామారెడ్డి మద్నూర్‌లో 40.9, కామారెడ్డి నిజాంసాగర్, గాంధారి మండలాల్లో 40.7, దోమకొండ, పాల్వంచ మండలాల్లో 40.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు.
Similar News
News April 3, 2025
సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధం

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలకు వడివడిగా ఏర్పాట్లను పూర్తి చేశామని దేవస్థాన ఆలయ ఈవో ఎల్ రమాదేవి తెలిపారు. కరోనా తర్వాత శ్రీరామనవమి ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు, ఉన్నత అధికారులు, న్యాయమూర్తులు ఇతర ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
News April 3, 2025
PDPL: విద్యాశాఖ కార్యదర్శితో వీసీలో పాల్గొన్న కలెక్టర్

ఆన్‌లైన్ ద్వారా మధ్యాహ్న భోజన చెల్లింపులకు చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా అన్నారు. మధ్యాహ్న భోజన పథకం బిల్లుల చెల్లింపుపై జిల్లా కలెక్టర్లు విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నట్టు తెలిపారు.
News April 3, 2025
ముస్లింలను అణచివేసేందుకే వక్ఫ్ బిల్లు: రాహుల్

దేశంలోని ముస్లింలను అణచివేసి, వారి ఆస్తి హక్కులను హరించేందుకు వక్ఫ్ బిల్లును ఓ ఆయుధంగా వాడుకుంటున్నారని ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘ముస్లింలను లక్ష్యంగా చేసుకునే వక్ఫ్ బిల్లు తీసుకొచ్చారు. భవిష్యత్‌లో దీనిని ఇతర వర్గాలపై కూడా ప్రయోగించవచ్చు. ఈ బిల్లు ఆర్టికల్ 25ను ఉల్లంఘిస్తుంది. ఇది దేశ ఆలోచనలపై దాడి చేస్తుంది’ అని ఆయన ఎక్స్‌లో తీవ్ర విమర్శలు చేశారు.