News February 5, 2025
కామారెడ్డి: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 1109 మంది అరెస్టు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738758123920_50127535-normal-WIFI.webp)
కామారెడ్డి జిల్లాలో మద్యం సేవించి జనవరి నెలలో 1109 మంది వాహనదారులు పట్టుబడినట్లు ఎస్పీ సింధుశర్మ తెలిపారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన జరిమానాలు విధిస్తామన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూదని తల్లిదండ్రులకు ఎస్పీ సింధుశర్మ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News February 6, 2025
MNCL: సింగరేణిలో డిపెండెంట్లకు శుభవార్త
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738769186437_50225406-normal-WIFI.webp)
సింగరేణి కంపెనీలో డిపెండెంట్ల వయస్సు 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచుతూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థలో పనిచేస్తూ మృతి చెందడంతో పాటు మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగుల వారసులకు 2018 మార్చి 9 నుంచి ఈ గరిష్ట వయోపరిమితి సడలింపు స్కీమ్ వర్తించనుంది. దీనివల్ల 2018 నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి తక్షణ ప్రయోజనం చేకూరనుండగా రానున్న రోజుల్లోనూ మరింత మందికి లబ్ధి చేకూరుతుంది.
News February 6, 2025
ఔదార్యం చాటుకున్న ఖానాపూర్ మహిళా పోలీసులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738767255935_50031511-normal-WIFI.webp)
ఖానాపూర్ పట్టణంలో బుధవారం మహిళా పోలీసులు ఔదార్యం చాటుకున్నారు. మల్లీశ్వరి, నర్సమ్మ పట్టణంలో విధలు నిర్వహిస్తుండగా బట్టలు లేకుండా తిరుగుతున్న మతిస్థిమితం లేని ఓ మహిళకు బట్టలు అందజేసి భోజనం పెట్టించారు. అనంతరం ఆమె వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.
News February 6, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738775675481_695-normal-WIFI.webp)
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.