News April 5, 2025
కామారెడ్డి: దరఖాస్తుల ఆహ్వానం

గ్రామ పాలన అధికారుల నియామకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన మాజీ వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తులను ఏప్రిల్ 16లోపు కలెక్టరేట్‌లో అందజేయాలన్నారు.
Similar News
News April 5, 2025
విశాఖ తీరంలో అమెరికా యుద్ధ విన్యాసాలు

విశాఖ తీరానికి సైనికులతో ఉన్న అమెరికా దేశ యుద్ధ నౌకలు వచ్చాయి. ఇండో పసిఫిక్ ప్రాంతం భద్రతకు దిక్సూచిగా భారత్- అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న టైగర్ ట్రయాంఫ్ 2025 విన్యాసాల్లో పాల్గొనడానికి విశాఖ తీరానికి చేరుకున్నాయి. ఈ నెల ఏడో తేదీ వరకు హార్బర్ ఫేజ్‌లో విన్యాసాలు జరుగుతాయి. అమెరికా యుద్ధనౌక యూఎస్ కంస్టాక్, రాల్స్ జాన్సన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
News April 5, 2025
విడదల రజినికి 10 ఏళ్ల శిక్ష పడే అవకాశం: అడ్వకేట్ జనరల్

స్టోన్ క్రషర్స్ యజమానిని బెదిరించి, డబ్బులు వసూలు చేసిన కేసులో మాజీ మంత్రి రజిని, ఆమె మరిది గోపికి 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశముందని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదించారు. ACB వేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని రజిని వేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. కేసులో రాజకీయ కారణాలు ఉన్నాయని రజని తరపున సీనియర్ న్యాయవాదులు శ్రీరామ్, మహేశ్వర రెడ్డి వాదించారు.
News April 5, 2025
రెండో రోజూ భారీగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ కూడా భారీగా తగ్గి సామాన్యుడికి కాస్త ఉపశమనాన్నిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి నేడు ₹980 తగ్గి ₹90,660కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ ₹900 తగ్గి ₹83,100గా పలుకుతోంది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ రూ.1,07,900కి చేరింది. కాగా, రెండ్రోజుల్లో తులం బంగారం రేటు రూ.2720 తగ్గడం విశేషం.