News March 18, 2025

కామారెడ్డి: నీటి సరఫరాకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: కలెక్టర్  

image

కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలకు మిషన్ భగీరథ నీటి సరఫరాకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్‌లో మిషన్ భగీరథ, మెడికల్ కళాశాల అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు శాశ్వత ప్రాతిపదికన మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.  

Similar News

News March 19, 2025

ఉపాధి కూలీలకు రూ.400 వేతనం ఇవ్వండి: సోనియా

image

గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు రోజువారీ కనీస వేతనాన్ని రూ.400 ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి 150 పనిదినాలు కల్పించాలన్నారు. పార్లమెంటులో జీరో అవర్‌లో ఆమె మాట్లాడారు. 2005లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం దీనిని నిర్వీర్యం చేయాలని చూడటం ఆందోళనకరమని చెప్పారు.

News March 19, 2025

కొత్తపల్లి: మనవడని దత్తత తీసుకుంటే.. నమ్మించి మట్టుబెట్టాడు!

image

కొత్తపల్లి మండల శివారులో ఈనెల 15న వెంకటమ్మ అనే వృద్ధురాలు హత్యకు గురైన విషయం తెలిసిందే. వెంకటమ్మను హత్య చేసిన మనవడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వెంకటమ్మకు కొడుకులు లేకపోవడంతో బిడ్డ కొడుకుని దత్తతకు తీసుకుని వివాహం జరిపించింది. వెంకటమ్మ వద్ద ఉన్న డబ్బు, బంగారం కోసం తరచూ ఇబ్బందులు పెట్టడంతో బంధువుల ఇంటి వద్ద ఉంటోంది. LIC డబ్బులు వచ్చాయని పిలిపించి హత్యచేసి పారిపోగా పోలీసులు అరెస్టు చేశారు

News March 19, 2025

సెన్సార్లు అమర్చాలని అనకాపల్లి కలెక్టర్ సూచన 

image

పరిశ్రమలలో రసాయనాల లీకేజ్ లను గుర్తించే సెన్సార్లను బయట లోపల అమర్చాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. కలెక్టరేట్లో జిల్లా సంక్షోభ నివారణ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పరిశ్రమలలో ప్రమాదాలు జరిగితే సమాచారాన్ని వెంటనే జిల్లా యంత్రాంగానికి తెలియ చేయాలన్నారు. జిల్లాలో గల 12 రసాయన పరిశ్రమలలో మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు.

error: Content is protected !!