News November 9, 2024
కామారెడ్డి: ప్రతి ఇల్లు హౌస్ లిస్టింగ్ పూర్తి చేయాలి: కలెక్టర్
ఏ ఒక్క ఇల్లు కూడా వదిలిపెట్టకుండా హౌస్ లిస్టింగ్ పూర్తి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో మండల ప్రత్యేక అధికారులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటి సమగ్ర సర్వే కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో చేపట్టిన హౌస్ లిస్టింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలని అన్నారు. ప్రతీ ఇంటికి స్టిక్కరింగ్ చేశారా, లేదా అనేవి మండల ప్రత్యేక అధికారులు పరిశీలించాలన్నారు.
Similar News
News December 27, 2024
మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు: టీపీసీసీ చీఫ్
మాజీ PM మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి, పీఎంగా ఆయన చేసిన సేవలు దేశ చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభాల నుంచి గట్టెక్కించి, అభివృద్ధి బాట పట్టించిన మహా ఆర్థిక మేధావి అని ‘X’ వేదికగా రాసుకొచ్చారు.
News December 26, 2024
NZB: జల్సాల కోసం బైకు దొంగతనాలు
నిజామాబాద్ జిల్లాలో జల్సాలకు బైకు దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ SHO రఘుపతి బుధవారం తెలిపారు. మాక్లూర్ మండలం మామిడిపల్లికి చెందిన కరిపే సుమన్ ఇటీవల దుబాయ్ నుంచి తిరిగి వచ్చి తాగుడుకు, జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో నిజామాబాద్, కోరుట్ల, నవీపేటలో బైకు దొంగతనాలకు పాల్పడ్డాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని రూ.2.5 లక్షల విలువ చేసే 5 బైకులు స్వాధీనం చేసుకున్నారు.
News December 26, 2024
రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలను నమ్మించి మోసం చేసింది: కవిత
రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలను నమ్మించి మోసం చేసిందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మెదక్ చర్చిని సందర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీ ఎగిరిపోయాయని ఆమె విమర్శించారు.