News August 17, 2024
కామారెడ్డి: భయపెట్టిస్తున్న జ్వరాలు
కామారెడ్డి జిల్లాలో ప్లూ, విషజ్వారాలకు తోడు డెంగ్యూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. జులై నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 62 డెంగీ కేసులు నమోదయ్యాయి. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వ యంత్రాంగం అవగాహన కల్పిస్తున్నా పూర్తిస్థాయిలో అమలు కావటం లేదు. జిల్లా ఆస్పత్రితో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడలో సైతం డెంగ్యూ పంజా విసురుతోంది.
Similar News
News February 6, 2025
NZB: రుణాలు ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి: సెర్ఫ్ డైరెక్టర్
స్వయం సహాయక సంఘ సభ్యులు బ్యాంకు రుణాలు పొంది జీవనోపాధి పొందుతున్న ఆదాయ వివరాలు ఈ రిజిస్టర్లో నమోదు చేయాలని సెర్ఫ్ డైరెక్టర్ ప్రశాంతి సూచించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన డీపీఎం, ఎపీఎం, సీసీ, కంప్యూటర్ ఆపరేటర్లు, గ్రామస్థాయిలో పనిచేసే అసిస్టెంట్లకు ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ అధికారి సాయ గౌడ్, జిల్లాల అధికారులున్నారు.
News February 5, 2025
NZB: పరీక్షా కేంద్రాలను తనిఖీ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షల కేంద్రాలను జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రవి కుమార్ మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల్లో జియో ట్యాగింగ్ చేయాలని, కెమెరాలు పని చేయకపోతే చర్యలు తప్పవన్నారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు జిల్లాలో 15 కేంద్రాలను తనిఖీ చేశారు.
News February 5, 2025
NZB: పంచాయతీ ఎన్నికలకు సిద్ధమా..!
పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అధికారులు ఎన్నికల సామగ్రిని మండల కేంద్రాలకు పంపించి భద్రపరిచారు. ఆర్మూర్ డివిజన్‌లో 180 పంచాయతీలుండగా బోధన్ డివిజన్ 152, నిజామాబాద్ డివిజన్‌లో 213 గ్రామ పంచాయతీలున్నాయి. ఇప్పటికే పలువురు ఆశావాహులు పార్టీ నేతలను కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.