News March 17, 2025
కామారెడ్డి: భార్యని చంపిన భర్త

అనుమానంతో భార్యని చంపాడో భర్త. ఈ ఘటన HYDలోని అంబర్‌పేట్‌లో జరిగింది. పోలీసుల వివరాలు.. కామారెడ్డి (D) దోమకొండ (M) అంబర్‌పేటకు చెందిన నవీన్‌కు బీబీపేట్(M)కు చెందిన రేఖ(27)తో పెళ్లైంది. వీరు HYDలో అంబర్‌పేట్‌లో నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన నవీన్ భార్య ప్రవర్తనపై అనుమానంతో ఈనెల 10న పెట్రోల్ పోసి నిప్పంటించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. రేఖ తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
Similar News
News March 17, 2025
మెదక్: లక్ష్యాలు పూర్తి చేయడంలో వేగం పెంచాలి: అదనపు కలెక్టర్

బ్యాంక్ గ్యారంటీలు, సీఎంఆర్ లక్ష్యాలు పూర్తి చేయడంలో రైస్ మిల్లర్స్, బ్యాంకర్స్ వేగం పెంచాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. సోమవారం ఖరీఫ్ 24 -25 సంబంధించి బ్యాంక్ గ్యారంటీలు అందజేయడం, సీఎంఆర్ లక్ష్యాలపై బ్యాంకర్లు, రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాల మేరకు లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.
News March 17, 2025
మెదక్: ప్రజావాణి వినతులు స్వీకరించిన జిల్లా ఎస్పీ

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని తెలిపారు.
News March 17, 2025
సీతానగరం: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

రైలు నుండి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సీతానగరం మండలం జగ్గు నాయుడుపేట సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. సోమవారం తాంబరం నుంచి చక్రధరపూర్ వెళ్తున్న రైలు నుంచి ప్రధాన్ హం బోరో (23) జారి పడడంతో మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి విజయనగరం తరలించామన్నారు.