News September 14, 2024
కామారెడ్డి: ముమ్మరంగా గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ పట్టణంలోని శ్రీ సిద్ధిరామేశ్వర ఆలయ సమీపంలో గల శాఖరి కుంటలో కార్యదర్శి మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు ముమ్మరంగా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనాలు సులువుగా వెళ్లేందుకు రహదారిని చదును చేసి, విద్యుత్ దీపాలను అమర్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయితీ కార్యనిర్వహణ అధికారి మహేశ్ గౌడ్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News December 22, 2024
కామారెడ్డి: ఫలితాలు విడుదల
శనివారం నిర్వహించిన కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. స్టెనో 14, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ 42, రికార్డ్ అసిస్టెంట్ పరీక్షకు 78 మంది పరీక్షలకు హాజరయ్యారు. 40% మార్కులు పొందిన అభ్యర్థులను స్కిల్ టెస్ట్, ఓరల్ ఇంటర్వ్యూలకు ఎంపిక చేసినట్లు ప్రిన్సిపల్ జడ్జ్ వరప్రసాద్ తెలిపారు. 2వ స్టేజి పరీక్షలు ఈ నెల 28న జరుగుతాయని ఫలితాలకు కోర్టు వెబ్సైట్ చూడాలని సూచించారు.
News December 22, 2024
NZB: బేస్బాల్ ఛాంపియన్గా జిల్లా మహిళా జట్టు
నిజామాబాద్ జిల్లా మహిళా జట్టు బేస్బాల్ ఛాంపియన్ షిప్ను కైవసం చేసుకుంది. సీఎం కప్ 2024 క్రీడా పోటీల్లో భాగంగా హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి సీఎం కప్ బేస్బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని 23 జిల్లాలు పాల్గొనగా ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టుతో నిజామాబాద్ జిల్లా జట్టు తలపడింది. ఇందులో 3-6 పరుగుల తేడాతో నిజామాబాద్ జట్టు విజయకేతనం ఎగురవేసింది.
News December 21, 2024
నిజామాబాద్: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని శనివారం సాయంత్రం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదివారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లపై ఎమ్మెల్యే, కలెక్టర్ ఆసుపత్రిలో వివిధ విభాగాల అధికారులతో మాట్లాడారు.