News February 2, 2025
కామారెడ్డి: వెటర్నియన్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటర్నియన్స్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పోచయ్య, కార్యదర్శిగా బి.కొండల్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు ఎల్.ప్రేమ్ సింగ్, కోశాధికారిగా ఎన్.నితిన్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులందరికీ పశుసంవర్ధక శాఖ అధికారులు అభినందనలు తెలిపారు.
Similar News
News March 12, 2025
కామారెడ్డి: పదోతరగతి విద్యార్థి సూసైడ్

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కడుపునొప్పి భరించలేక గర్గుల్‌కు చెందిన పదోవతరగతి విద్యార్థి శరత్ కుమార్ (16) ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా శరత్‌కు క్రికెట్ అంటే ప్రాణమని పైగా విరాట్ కోహ్లికి వీరాభిమాని అని స్థానికులు తెలిపారు. జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీల్లో అనేక అవార్డులను శరత్ సొంతం చేసుకున్నాడు. శరత్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News March 12, 2025
పాత సెల్‌ఫోన్లు అమ్మేస్తున్నారా?

పాత సెల్‌ఫోన్లు కొని వాటితో సైబర్ నేరాలకు పాల్పడుతున్న బిహార్ ముఠాను ADB సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 2,125 సెల్‌ఫోన్లు, 107 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ‘చాలామంది పాత ఫోన్లలో సిమ్‌లు అలాగే ఉంచి అమ్మేస్తున్నారు. వాటితో నిందితులు సైబర్ నేరాలు చేస్తున్నారు. ఫలితంగా అమ్మినవారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాత ఫోన్లు అమ్మే ముందు జాగ్రత్త పడండి’ అని పోలీసులు సూచించారు.
News March 12, 2025
సైదాపూర్: గ్రూప్-2 RESULT.. యువకుడికి 70వ ర్యాంక్

సైదాపూర్ మండలం ఎక్లాస్‌పూర్‌కి చెందిన సంతపురి నిఖిల్ రెడ్డి గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటాడు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో రాష్ట్రంలో 70వ ర్యాంకు సాధించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నిఖిల్ రెడ్డి గతంలో గ్రూప్-4లో 7వ ర్యాంకు సాధించి ప్రస్తుతం కరీంనగర్ డీటీఓ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు.