News February 25, 2025
కామారెడ్డి: వేములవాడకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

మహా శివరాత్రి పండగ సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజినల్ మేనేజర్ జ్యోష్నా సోమవారం తెలిపారు. 25, 26, 27 తేదీల్లో నిజామాబాద్ నుంచి వేములవాడకు పెద్దలకు రూ.270, పిల్లలకు రూ.150 టికెట్ ధరతో.. ఆర్మూర్ నుంచి రూ.220 పెద్దలకు, రూ.120 పిల్లలకు, కామారెడ్డి నుంచి పెద్దలకు రూ.140, పిల్లలకు రూ.80 టికెట్ ధర ఉంటుందన్నారు.
Similar News
News February 25, 2025
YS జగన్‌పై మంత్రి స్వామి హాట్ కామెంట్స్

30 ఏళ్లు అధికారం నాదేనంటూ విర్రవీగిన జగన్‌ని ప్రజలు ఐదేళ్లకే భరించలేక ఛీత్కరించినా.. మళ్ళీ మరో 30 ఏళ్లు అధికారం తమదేనని జగన్ కార్యకర్తలను మభ్యపెడుతున్నాడని మంత్రి స్వామి అన్నారు. సోమవారం అసెంబ్లీలో పట్టుమని పది నిమిషాలు కూడా ఉండలేకపోయాడని ఎద్దేవా చేశారు. జగన్‌కి పదవులు మీద ఉన్న ఆరాటం ప్రజాసమస్యలపై లేకపోవడం సిగ్గుచేటన్నారు. 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే తనపదవి రద్దవుతుందని వచ్చారన్నారు.
News February 25, 2025
ఏలూరు: మసాజ్ సెంటర్ కేసులో నిందితుడు అరెస్ట్

ఏలూరులో మసాజ్ సెంటర్ల పేరిట వ్యభిచారం నిర్వహించిన ఘటన ఇటీవల సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు భాను ప్రసాద్ పోలీసులకు చిక్కాడు. సోమవారం సాయంత్రం అతణ్ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. అతనికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఏలూరు సబ్ జైలుకు తరలించారు.
News February 25, 2025
తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ టీడీపీలోకి చేరిక

తునిలో వైసీపీకి మరో షాక్ తగిలింది. మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే ఛైర్ పర్సన్ ఏలూరు సుధారాణి రాజీనామా చేసిన కొన్ని గంటలకే ఆరుగురు కౌన్సిల్ సభ్యులు టీడీపీ గూటికి చేరారు. తాజాగా సోమవారం సాయంత్రం హైదరాబాదులో యనమల దివ్య సమక్షంలో వైస్ ఛైర్మన్ కూచ్చర్లపాటి రూపా దేవి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికీ టీడీపీ బలం 16కు చేరుకుంది.