News April 3, 2025
కామారెడ్డి: శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: DEO

ఇటీవల ప్రమోషన్ పొందిన GHM, PSHM, SAలకు నిజామాబాద్‌లో శిక్షణ ఉంటుందని DEO రాజు తెలిపారు. ఈ నెల 3న SA (తెలుగు), 4న SA(హిందీ) టీచర్లకు కామారెడ్డి ZPHS బాయ్స్, కృష్ణాజివాడి ZPHSలో శిక్షణ ఉంటుందన్నారు. అలాగే SA (ఉర్దూ) మీడియం టీచర్లకు హైదరాబాద్ TGIRDలో మిగతా ఉర్దూ మీడియం సబ్జెక్ట్స్ టీచర్లకు నిజామాబాద్‌లో శిక్షణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని DEO సూచించారు.
Similar News
News April 4, 2025
తుర్కపల్లి: పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్

తుర్కపల్లి మండలంలో కురిసిన అకాల వర్షాల వల్ల నష్టం జరిగిన పంట పొలాలను కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టపోయిన పంటల వివరాలను తెలుసుకున్నారు. మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిలిందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కాగా క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టం వివరాలను అంచనా వేయాలని వ్యవసాయ అధికారులను ఆయన ఆదేశించారు.
News April 4, 2025
IIT హదరాబాద్‌కు విరాళమిస్తే నో టాక్స్

ప్రముఖ విద్యాసంస్థ ఐఐటీ హైదరాబాద్‌కు విరాళమిచ్చే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ విద్యా సంస్థకు విరాళం ఇస్తే ఆ మొత్తానికి సంబంధించి టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. గతంలో 50% పన్ను చెల్లించాల్సి ఉండేది. అయితే ఇపుడు ఐటీ యాక్ట్ సెక్షన్ 80జీ ప్రకారం విరాళాలు టాక్స్ ఫ్రీ అని ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొ.బీఎస్ మూర్తి తెలిపారు.
News April 4, 2025
15th ఫైనాన్స్‌కు మహబూబ్‌నగర్ కార్పొరేషన్ ఎంపిక

కేంద్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లకు గ్రాంట్లు ఇచ్చేందుకు ప్రవేశపెట్టిన 15వ ఫైనాన్స్‌కు ఈసారి మన మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ ఎంపికైంది. ఈ ఎంపికను ఆస్తి పన్నులను 21 శాతం వసూలు చేయడంతో కేంద్ర ప్రభుత్వం పాలమూరుకు అవకాశం కల్పించింది. ఇక నేడో రేపో మహబూబ్‌నగర్ నగర పాలక సంస్థకు రూ.30 కోట్ల గ్రాంట్స్‌ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. దీంతో పట్టణంలో అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి.