News April 12, 2025
కామారెడ్డి: ‘సిటీ స్కానింగ్ మిషన్ ఏర్పాటు చేయాలి’

కామారెడ్డిలో గల 250 పడకల ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ యంత్రం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మంత్రి దమోదర రాజనర్సింహను కోరారు. ఈ మేరకు హైదరాబాదులో మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ యంత్రం లేకపోవడంతో పేద రోగులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
Similar News
News December 18, 2025
పాలమూరు: సర్పంచులు వచ్చారు.. సమస్యలు తీరేనా..?

గ్రామాల్లో రెండేళ్లుగా సర్పంచ్ పాలన లేకపోవడంతో మౌలిక సమస్యలు పేరుకుపోయాయి. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిదీపాలు, అభివృద్ధి పనులు అర్ధాంతరంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో తాజాగా మూడు విడతలుగా జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్త సర్పంచ్‌లు వచ్చారు. గ్రామాల్లోని సమస్యలు వీరిని ఆహ్వానిస్తున్నాయి. మీమీ గ్రామాల్లో ఏమేం సమస్యలున్నాయో COMMENT..!
News December 18, 2025
కలబందతో చర్మానికి ఎన్నో లాభాలు

జిడ్డు చర్మం ఉన్నవారు తరచూ ముఖానికి కలబంద రాయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గి గ్లో వస్తుంది. సున్నిత చర్మం ఉన్నవారికి సన్ బర్న్, హీట్ రాషెస్ వంటి సమస్యలకు కలబంద బాగా పని చేస్తుంది. కలబంద, ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం సున్నితంగా మారడంతో పాటు, ముడతలను తగ్గిస్తుంది. చర్మం తక్షణ మెరుపు సంతరించుకోవాలంటే అలోవెరా జెల్, మామిడి గుజ్జు, నిమ్మరసం కలిపి ప్యాక్ వేసుకోవాలి.
News December 18, 2025
శ్రీకాకుళం: ట్రక్ షీట్ల జారీపై జేసీ సూచనలు

ధాన్యం కొనుగోలులో భాగంగా రైతు సేవా కేంద్రాల్లో జారీ చేస్తున్న ట్రక్ షీట్లపై శ్రీకాకుళం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ బుధవారం కీలక సూచనలు చేశారు. రాత్రి 7 నుంచి ఉదయం 5 లోపు ట్రక్ షీట్లను జారీ చేయొద్దని సిబ్బందికి సూచించారు. మెలియాపుట్టి మండలం పెద్దలక్ష్మీపురం RSK పరిధిలో బుధవారం వేకువజామున 3 గంటలకు 10 ట్రక్ షీట్లు ఇవ్వడంపై కోసమాల, నందిగం, సోంపేట PACS పరిధిలో నలుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగించారు.


