News February 3, 2025
కామారెడ్డి: సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్ సీసీ కెమెరాల నిఘాలో జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 48 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇంటర్మీడియట్ జనరల్ విద్యార్థులు 15,267 మంది, ఒకేషనల్ కోర్సు విద్యార్థులు 3,979 మంది ప్రాక్టికల్స్ కు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లు జరగనున్నాయి.
Similar News
News February 3, 2025
ట్రంప్ సుంకాలు.. ఆందోళన లేదు: ఆర్థిక మంత్రి నిర్మల
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పెద్దగా ఆందోళన చెందడం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ‘సుంకాల గురించి ఎలాంటి ఆందోళనా లేదు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం. ప్రత్యక్షంగా ఎలాంటి ప్రభావం ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేం. పరోక్షంగా ప్రభావం ఉండొచ్చు. మా ప్రధాన లక్ష్యం ఆత్మనిర్భరతే’ అని పేర్కొన్నారు.
News February 3, 2025
పెద్దపల్లి: MLC కవితకు ఘన స్వాగతం..
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమాలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చిన సందర్భంగా పెద్దపల్లి మండలంలోని పెద్దకాల్వల వద్ద BRS శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా నాయకులు కవితకు పుష్పగుచ్ఛం ఇవ్వగా.. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి బీఅర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
News February 3, 2025
కామారెడ్డి BJP జిల్లా అధ్యక్షుడిగా రాజు
కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నీలం రాజు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకుముందు జిల్లా అధ్యక్షురాలిగా అరుణాతార పనిచేశారు. ఆమె స్థానంలో రాజును నియమించారు .అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఆయన బీజేపీకి ఎన్నో సేవలు అందించారు. ఆయన సేవలను పార్టీ అధిష్టానం గుర్తించింది.