News April 8, 2025
కామారెడ్డిలో కల్తీ కల్లు తాగి 58 మందికి అస్వస్థత

కల్తీ కల్లు తాగి 58 మంది అస్వస్థతకు గురైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్, అంకోల్ తండా, దుర్కి, బీర్కూర్ మండలం రామరంచ గ్రామాలకు చెందిన 58 మంది సోమవారం కల్లు దుకాణాల్లో కల్తీ కల్లు తాగారు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది వెంటనే 46 బాన్సువాడ ఆసుపత్రికి, 12 మందిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News April 17, 2025
సోషల్ మీడియాలో పోస్ట్.. వ్యక్తిపై కేసు నమోదు: సీఐ

మహిళలను కించపరుస్తూ అసభ్యకరంగా ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్ పెట్టిన వైసీపీ నాయకుడిపై కేసు నమోదు చేసినట్లు మదనపల్లె రెండవ పట్టణ సీఐ రామచంద్ర తెలిపారు. మదనపల్లెలోని శివాజీ నగర్‌లో ఉండే మహబూబ్ ఖాన్ ఫిర్యాదు మేరకు ఎక్స్‌లో అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టిన వైసీపీ నేతపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
News April 17, 2025
గిన్నిస్ బుక్‌లో స్థానం సాధించిన కర్లపాలెం విద్యార్థి

బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం బిడారుదిబ్బ గ్రామానికి చెందిన కే జోయెల్ విల్సన్ సంగీతంలో వరల్డ్ రికార్డుతో పాటు గిన్నిస్ బుక్‌లో పేరు సంపాదించాడు. గత 6 నెలల వ్యవధి కాలంలో అగస్టీన్ దండంగి సారధ్యంలో సంగీతం (కీబోర్డ్) లో మెలకువలు నేర్చుకున్నాడు. ప్రపంచంలో 18 దేశాల నుంచి 1046 మంది సంగీత విధ్వాంసులతో సంగీతం ప్లే చేసి గిన్నిస్ బుక్‌లో స్థానం సాదించుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు అతనిని అభినందించారు.
News April 17, 2025
ఎడపల్లి: బ్రాహ్మణపల్లిలో వివాహిత ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఎర్రోళ్ల అనిత(35) సూసైడ్ చేసుకుంది. ఆమె బంధువులు కొందరు అవమానపరిచారని మనస్థాపం చెంది ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.