News March 6, 2025
కామారెడ్డిలో ఫ్లెక్సీ షాపులు బంద్

మార్చ్ 8, 9వ తేదీల్లో కామారెడ్డిలో ఫ్లెక్సీ షాపులు బంద్ చేస్తున్నట్లు ఫ్లెక్సీ షాప్ అసోసియేషన్ యజమానులు తెలిపారు. ఫ్లెక్సీ కలర్స్ మెటీరియల్స్ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంతో నిరసిస్తూ.. నూతన ధరలను పెంచడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఈ నెల 8, 9 రెండు రోజులు ఫ్లెక్సీ షాపులు బంద్ పాటిస్తున్నట్లు యజమానులు తెలిపారు.
Similar News
News March 6, 2025
ఫైనల్లో నా సపోర్ట్ న్యూజిలాండ్‌కే: డేవిడ్ మిల్లర్

CT సెమీస్‌లో దక్షిణాఫ్రికా ఓటమికి ఇండియానే కారణమని సౌతాఫ్రికా ప్లేయర్ డేవిడ్ మిల్లర్ ఆరోపించారు. అస్తవ్యస్త పర్యటన వల్ల ప్రాక్టీస్ చేసే సమయం లేదన్నారు. భారత్ పాక్‌లో ఆడకపోవడం వల్లే తాము ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. ఛాంఫియన్స్ ట్రోఫీ పైనల్‌లో తన మద్దతు న్యూజిలాండ్‌కేనని తెలిపారు. NZతో జరిగిన రెండో సెమీస్‌లో మిల్లర్ సెంచరీ చేసినప్పటికీ దక్షిణాఫ్రికా గెలవలేదు.
News March 6, 2025
ధూళ్‌మిట్ట: ప్రమాదవశాత్తు బావిలో పడి రైతు మృతి

ధూళ్‌మిట్ట మండలం బైరాన్‌పల్లి గ్రామానికి చెందిన రైతు భోషనబోయిన సాయిలు(70) ప్రమాదవశాత్తు తన వ్యవసాయ బావిలో పడి బుధవారం రాత్రి మరణించారు. బావిలో పంపు మోటర్ చెడిపోవడంతో దానికి సాయిలు మరమ్మతులు చేపట్టారు. అనంతరం బావిలో నుంచి పైకి ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు.
News March 6, 2025
దేశం పేరు వినలేదన్న ట్రంప్… ‘లెసోతో’ దేశం ప్రత్యేకతలివే…!

ఆఫ్రికాలోని ఈ దేశంలో గ్రామాలు చాలా ఎత్తులో ఉంటాయి. అక్కడికి వెళ్లాలంటే కాలినడక, గుర్రాలే మార్గం. తెల్లబంగారంగా పిలిచే ఇక్కడి నీటిని సౌతాఫ్రికాకు ఎగుమతి చేస్తారు. స్కీయింగ్‌కు బెస్ట్ ప్లేస్. సముద్ర మట్టానికి 3,222 మీటర్ల ఎత్తులో ఉంది. లెవిస్, రాంగ్లర్ బ్రాండ్లకు అవసరమైన జీన్స్ ఇక్కడే కుడతారు. వరల్డ్‌లోనే అత్యధిక HIVరేటు కలిగిన దేశం. అత్యధిక ఆత్మహత్యల రేటు నమోదయ్యేది
లెసోతోలోనే.