News February 9, 2025
కామారెడ్డిలో సేవలు.. గుంటూరులో అవార్డు

కామారెడ్డి రక్తదాతల సమూహ ఫౌండర్ డా.బాలు జాతీయ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. జయ జయ సాయి ట్రస్ట్ గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో MLA ప్రత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా డా.బాలు జాతీయ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన వ్యక్తిగతంగా ఇప్పటి వరకు 75 సార్లు రక్తం దానం చేశారు. అంతేగాక తలసేమియాతో బాధపడుతున్న పిల్లల కోసం రక్తాన్ని సేకరించి అండగా నిలిచారు.
Similar News
News December 16, 2025
ఈనెల 18 వరకు జిల్లాలో ఆంక్షలు అమలు: SP

మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 18 వరకు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. ఆదేశాల ప్రకారం నలుగురు, అంతకంటే ఎక్కువ గుంపులుగా చేరడం, ర్యాలీలు, సమావేశాలు, సభలు నిర్వహించడం పూర్తిగా నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘించి నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
News December 16, 2025
AP-RCET ఫలితాలు విడుదల

పీహెచ్‌డీ సీట్ల భర్తీకి నిర్వహించే AP-RCET(రీసెర్చ్ కామన్స్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలు విడుదలయ్యాయి. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఆధ్వర్యంలో గత నెల నవంబరులో పరీక్షలు జరిగాయి. మొత్తం 65 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించగా, 5,164 మంది ఎగ్జామ్స్ రాశారు. వారిలో 2,859 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఏపీ ఆర్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.ఉష తెలిపారు. ఇక్కడ <
News December 16, 2025
కరీంనగర్: SU M.Ed పరీక్ష ఫీజు నోటిఫికేషన్ విడుదల

శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో జరుగనున్న M.Ed 1వ, 3వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ అధికారులు విడుదల చేశారు. దీనిలో భాగంగా అపరాధ రుసుం లేకుండా DEC 24 వరకు, లేట్ ఫీజు రుసుం రూ.500తో DEC 30 వరకు చెల్లించుకోవచ్చని SU పరీక్షల నియంత్రణ అధికారి డా.సురేశ్ కుమార్ తెలిపారు. పరీక్షలు JAN 2026 లో జరుగుతాయని తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ లో చూడాలని లేదా ఆయా కళాశాలలో సంప్రదించాలన్నారు.


