News March 20, 2024
కారేపల్లి సొసైటీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం?

కారేపల్లి సొసైటీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం చేసినట్లు మండలంలో జోరుగా చర్చ జరుగుతుంది. 2, 3 రోజుల్లో సొసైటీ డైరెక్టర్లు ఖమ్మం డిసిఓని కలవడానికి వెళ్ళనున్నట్లు తెలుస్తుంది. కాగా మండలంలో సొసైటీ డైరెక్టర్లు మొత్తం 13 మంది ఉండగా, పదిమంది డైరెక్టర్లు చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Similar News
News April 15, 2025
ఖమ్మం : బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి

బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుదిమళ్లకి చెందిన చెరుకుపల్లి నర్సింహారావు (47) గ్రామ పరిధిలో ఓ ఇటుక బట్టీలో పని చేస్తున్నాడు. రోజూలాగే సోమవారం పనికి వెళ్లి బైక్ పై ఇంటికి వెళ్తుండగా.. అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో నర్సింహారావు తలకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
News April 15, 2025
పైలెట్ ప్రాజెక్టుగా నేలకొండపల్లి ఎంపిక

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూభారతి పోర్టల్ అమలుకు చర్యలు చేపట్టింది. కాగా పైలెట్ ప్రాజెక్ట్ గా ఖమ్మం జిల్లా నుంచి ప్రభుత్వం నేలకొండపల్లిని ఎంపిక చేసింది. నేలకొండపల్లి మండలంలో భూభారతి పోర్టల్ ద్వారానే భూముల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. పైలెట్ ప్రాజెక్ట్ గా నేలకొండపల్లిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News April 15, 2025
ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలు అరెస్ట్: సీఐ

ప్రియుడిని గొంతునులిమి హత్య చేసిన ప్రియురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఖమ్మం ఖానాపురం సీఐ భానుప్రసాద్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. ఖమ్మంకు చెందిన లావణ్య(35) తన భర్తతో విడిపోయి సత్తుపల్లిలో రవిప్రసాద్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తూ నివాసముంటుంది. కాగా తరచూ రవి ప్రసాద్ లావణ్యతో మద్యం తాగి గొడవపడేవాడు. ఏప్రిల్ 6న మద్యం మత్తులో ఉన్న ప్రసాద్‌ను గొంతునులిమి హత్య చేసిందని పేర్కొన్నారు.