News January 12, 2025

కార్పొరేషన్‌పై కాషాయి జెండా ఎగురవేయడమే మా లక్ష్యం: ఎంపీ అరవింద్

image

బీజేపీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన వారికీ హైదరాబాద్‌లోని ఎంపీ అరవింద్ నివాసంలో శనివారం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అధ్యక్షతన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నియామక పత్రాలు అందజేశారు. నూతనంగా నియమితులైన మండల అధ్యక్షులు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. కార్పొరేషన్‌పై జెండా ఎగరవేయడమే లక్ష్యమని ఎంపీ అరవింద్ అన్నారు.

Similar News

News January 12, 2025

NZB: ఇంటి ముందు పార్కింగ్ చేసిన కారు చోరీ

image

నిజామాబాద్‌లో ఇంటి ముందు పార్కింగ్ చేసిన కారును దుండగులు చోరీ చేసినట్లు శనివారం మూడో టోన్ ఎస్‌ఐ హరిబాబు తెలిపారు. ఆయన వివరాలు.. గౌతమ్ నగర్‌కు చెందిన పవన్ ఈ నెల 9వ తేదీన తన ఇంటి ముందు కారు పార్క్ చేసి హైదరాబాద్‌కు వెళ్లాడు. మరుసటి రోజు వచ్చి వచ్చే సరికి పార్కింగ్ చేసిన కారు చోరీకి గురైంది. బాధితుడు మూడో టౌన్‌ పోలీసు స్టేషన్‌లో  ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.

News January 12, 2025

NZB: రెండు బైక్‌లు ఢీ.. యువకుడి మృతి

image

నిజామాబాద్‌లో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. మోస్రాకు చెందిన పీర్ సింగ్(35) పని నిమిత్తం తన బైక్‌‌పై నిజామాబాద్‌కు వచ్చాడు. వర్ని చౌరస్తా వద్ద ఎదురెదురుగా వస్తున్న మరో బైక్‌ ఢీ కొట్టింది. ఈ ఘటనలో పీర్ సింగ్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఐదో టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News January 12, 2025

NZB: జిల్లాలో పర్యటించనున్న ఎమ్మెల్సీ కవిత

image

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం పర్యటించనున్నారు. ఈ మేరకు ఆదివారం ఉదయం 12 గంటలకు నిజామాబాద్‌లో జరిగే ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌ను కవిత ప్రారంభిస్తారు. అనంతరం ఒంటి గంటకు తబ్లిగీ జమాత్ వేదిక సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు వర్ని బడాపహాడ్ దర్గాను దర్శించనున్నారు. సాయంత్రం 4 గంటలకు బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్తలలో సమావేశమై, పలు అంశాలపై చర్చిస్తారు.