News February 9, 2025
కాళేశ్వరం: త్రివేణి సంగమం వద్ద భక్తుల పుణ్య స్నానాలు

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలో 42 ఏళ్ల తర్వాత మహా కుంభాభిషేక మహోత్సవాలు ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు జరుగుతున్నాయి. కాగా, భక్తులు కాళేశ్వరం గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరించి, ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ఈ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉ.10:42కు వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు.
Similar News
News December 17, 2025
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 21.49% పోలింగ్

కామారెడ్డి జిల్లాలో మూడో విడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. ఇప్పటివరకు 40,890 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల వరకు ఆయా మండలాల్లో నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.
బాన్సువాడ-19.90%
బీర్కూర్-18.23
బిచ్కుంద-27.70%
పెద్దకొడప్గల్-27.15%
మద్నూర్-14.70%
డోంగ్లి-25.43%
జుక్కల్-21.07%
నస్రుల్లాబాద్-21.90%
పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
News December 17, 2025
NLG: ‘యూరియా కట్టడికి ప్రభుత్వం చర్యలు’

యాసంగి సీజన్‌లో రైతులకు యూరియా అందించడంతో పాటు యూరియా వినియోగాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నూతనంగా యూరియా బుకింగ్ యాప్‌ను తీసుకొచ్చింది. దీంతో రైతులు యాప్‌లో ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈనెల 20 నుంచి ఈ యాప్‌ను అందుబాటులో తీసుకొచ్చేలా జిల్లా వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తుంది.
News December 17, 2025
@9AM.. పోలింగ్ శాతం ఎంతంటే?

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.
★ వరంగల్: 22.26%
★ హనుమకొండ: 21.52%
★ ములుగు: 20.96%
★ భూపాలపల్లి: 26.11%
★ జనగాం: 22.51%
★ మహబూబాబాద్: 27.49%
➤ మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరుగుతుంది. మ.2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.


