News February 22, 2025
కాళేశ్వరంలో ఘనంగా సాగుతున్న పరిశుద్ధ్య పనులు

మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో మహాశివరాత్రికి ప్రత్యేక పరిశుద్ధ్య పనులు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చేస్తున్నారు. శనివారం పుష్కర ఘాట్ ఆవరణంలో అక్కడ ఉన్న చెత్త చదరంగం మొత్తం తీసి క్లీన్ చేసి దూరంగా పడేస్తున్నారు. దీంతో వీఐపీ ఘాట్ స్నానానికి వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంది.
Similar News
News February 23, 2025
పోక్సో, గ్రేవ్ కేసుల విచారణ పూర్తి చేయాలి: ఎస్పీ

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో ఎస్పీ డివి శ్రీనివాసరావు నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ పూర్తి పారదర్శకంగా చేయాలన్నారు. పోక్సో, గ్రేవ్ కేసులలో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తిచేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయాలని సూచించారు.
News February 23, 2025
వరంగల్: మహా శివరాత్రి.. మరో 3 రోజులే!

శివరాత్రి వేడుకలకు ఓరుగల్లు పెట్టింది పేరు. WGL నగరంలోని వేయి స్తంభాల గుడి, సిద్ధేశ్వరాలయం, మెట్టుగుట్ట సహా పలు దేవాలయాలు భక్తులతో పండుగరోజు నిండిపోతాయి. ఐనవోలు(HNK), రామప్ప(ములుగు), కాళేశ్వరాలయం(BHPL), పాలకుర్తి సోమేశ్వర(జనగామ), కురవి వీరభద్రస్వామి(MHBD) దేవాలయాలు జాగారం ఉన్న శివ భక్తులతో కిటకిటలాడతాయి. రాత్రంతా భక్తుల భజనలు, కీర్తనలతో దద్దరిల్లుతాయి. మీరు ఏ గుడికి వెళ్తున్నారో కామెంట్ చేయండి.
News February 23, 2025
అనకాపల్లి: ‘ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ’

అనకాపల్లి జిల్లాలో ఐదు మోడల్ స్కూళ్లలో ఆరవ తరగతిలో ప్రవేశానికి ఈ ఏడాది ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈవో అప్పారావు నాయుడు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐదవ తరగతి స్థాయిలో ప్రవేశ ఉంటుందన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఆన్‌లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలకు www.crse.ap.gov.in ను చూడాలన్నారు.