News November 13, 2024
కాళోజీ సేవలను స్మరించుకున్న కేసీఆర్
ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్మరించుకున్నారు. మహోన్నతమైన తెలంగాణ అస్తిత్వాన్ని, సాహిత్య సాంస్కృతిక గరిమన ప్రపంచానికి చాటిన గొప్ప కవి అని, కవిగా తన కలాన్ని, గళాన్ని, జీవితాన్ని తెలంగాణ కోసం అర్పించిన కాళోజీ కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
Similar News
News November 24, 2024
మెదక్: కాంగ్రెస్ హామీలు.. నీటి మీద రాతలు: హరీష్ రావు
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంకలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి పర్యటించారు. స్వాగతం పలికిన మహిళలతో హరీష్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మహిళలకు ఇస్తానన్న రూ.2500, తులం బంగారం అందుతున్నాయా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మాటలు నీటి మీద రాతలన్నారు.
News November 23, 2024
MDK: మహరాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ గ్యారంటీలను నమ్మలేదు: హరీశ్‌రావు
మహారాష్ట్రలో 5 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు నమ్మలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారని, ఇక్కడ మహిళలకు రూ.2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా మహారాష్ట్రలో రూ.3,000 ఇస్తామనడం.. రైతు భరోసా ఎగ్గొట్టడం.. ఆసరా ధోఖ, రైతు రుణమాఫీ ఏడాది గడుస్తున్నా పూర్తి చేయకపోవడం వంటివి మహారాష్ట్రలో ప్రభావం చూపాయన్నారు.
News November 23, 2024
సంగారెడ్డి: ఫైర్ సేఫ్టీ నిబంధనలపై ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష
ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఓ దవాఖానలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి పిల్లలు చనిపోయిన ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు బాధాకరం అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.