News March 19, 2025
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా డా.నందకుమార్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠాత్మకమైన కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా డాక్టర్ నందకుమార్ రెడ్డి నియమిస్తూ కొద్ది సేపటి క్రితం యూనివర్సిటీ ఛాన్సలర్, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో నందకుమార్ రెడ్డి మూడేళ్లు కొనసాగనున్నారు.
Similar News
News March 19, 2025
ఫ్రిజ్‌లో 12 టన్నుల మేక మాంసం..!

హైదరాబాద్‌లోని మంగళ్‌హట్‌లో రూ.8 లక్షలు విలువ చేసే 12 టన్నుల మేక మాంసాన్ని GHMC టాస్క్ ఫోర్స్ సిబ్బంది సీజ్ చేశారు. మహమ్మద్ అఫ్రోజ్ అనే వ్యాపారి తక్కువ ధరకు గొర్రెలు, మేకల మాంసాన్ని కొని ప్రిజ్‌లో భద్రపరుస్తున్నట్లు గుర్తించారు. ఇలా నిల్వచేసిన మాంసాన్ని హోటళ్లు, శుభకార్యాలకు సప్లై చేస్తున్నట్లు తేల్చారు. ఈ ఘటనతో రెస్టారెంట్లలో తినే ముందు ఆలోచించాల్సిందేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News March 19, 2025
నాగర్‌కర్నూల్: ప్రభుత్వ ఆస్పత్రిలో ఆధునిక పరికరాలు ప్రారంభం

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న గర్భిణుల కోసం మెరుగైన సేవలు అందించేందుకు, సాధారణ ప్రసవాలు చేసేందుకు, అధునాతన హైడ్రాలిక్ టేబుల్స్ వినియోగించేందుకు ఆసుపత్రిలో లేబర్ రూమ్‌లో అధునాత పరికరాలను ప్రారంభించామని సూపరింటెండెంట్ ఆర్.రఘు తెలిపారు. ప్రతి గర్భిణీ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం పొందాలని సూచించారు. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
News March 19, 2025
వాతావరణ మార్పులపై అధికారులతో MHBD కలెక్టర్ సమీక్ష

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అద్విత్ కుమార్ సింగ్ అధికారులతో జిల్లాస్థాయి వాతావరణ మార్పుల టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ వడదెబ్బ నుంచి ఎలా చర్యలు తీసుకోవాలనే పూర్తి అవగాహన కార్యక్రమాలు ప్రజలకు అర్థమయ్యే విధంగా అన్ని సాధనాల ద్వారా విస్తృత ప్రచారం కలిగించి ఎండ నివారణ చర్యలు తీసుకోవాలన్నారు.