News July 28, 2024
కావలి పరిధిలో బాలికపై అత్యాచారం.. కేసు నమోదు
కూతురు వయసున్న బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కావలి నియోజకవర్గంలో జరిగింది. బాలిక ఇంటికి తరచూ వస్తూ పోతున్న మృగాడు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కావలి రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 17, 2025
నెల్లూరు: ఆర్నెల్ల క్రితమే పెళ్లైంది.. ఇంతలోనే విషాదం
సరదాగా గడిపి సేదతీరేందుకు వెళ్లిన ముగ్గురిని కడలి బలితీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన మాధవ(25)కు, నెల్లూరు జిల్లా, కందుకూరు(M), అనంతసాగరానికి చెందిన నవ్వతో ఆర్నెల్ల క్రితం పెళ్లి అయ్యింది. సంక్రాంతి సందర్భంగా బంధువులు, స్నేహితులతో కలిసి వారు పాకల బీచ్‌కి వెళ్లారు. ఈ క్రమంలో అలల్లో చిక్కుకుని మాధవ, నవ్య సోదరి యామిని, మాధవ బాబాయ్ కుమార్తె జెస్సికా మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
News January 17, 2025
నెల్లూరు: గుండెపోటుతో MLA తమ్ముడి మృతి
వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు కురుగొండ్ల శేఖర్ కన్నుమూశారు. డక్కిలి మండలం కమ్మవారిపల్లికి చెందిన శేఖర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ గుంటూరులో స్థిరపడ్డారు. ఈక్రమంలో నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వెంటనే గుంటూరుకు బయల్దేరారు.
News January 17, 2025
టౌన్ ప్లానింగ్‌లో నూతన సంస్కరణలు అమలు: మంత్రి
దేశంలో ఎక్కడా లేనివిధంగా పట్టణాభివృద్ధి, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో నూతన సంస్కరణలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గురువారం నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులుతో కలిసి సమీక్షించారు.