News October 1, 2024

కావలిలో రోడ్డు ప్రమాదం.. విద్యార్థిని మృతి

image

కావలి పరిధిలోని హైవేపై మద్దూరుపాడు ఆర్కే దాబా వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కృపాకర్, మైథిలి అనే ఇద్దరు ఒంగోలు నుంచి నెల్లూరుకు స్కూటీపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. నెల్లూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మైథిలి మృతి చెందింది. కృపాకర్‌కి తీవ్రగాయాలయ్యాయి. వీరిది ప్రకాశం(జి) పొన్నలూరు(M) చెరుకూరు గ్రామం. మృతురాలు పదో తరగతి చదువుతోంది. కావలి రూరల్ SI బాజీ బాబు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News October 1, 2024

నెల్లూరు: ఈ నెల 3వ తేదీ నుంచి 21 వరకు టెట్ పరీక్షలు: DRO

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ నెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని డీఆర్వో లవన్న అధికారులను ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్లోని శంకరన్ సమావేశ మందిరంలో టెట్ పరీక్షల నిర్వహణపై సమన్వయ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 4 పరీక్ష కేంద్రాల్లో ఈనెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

News October 1, 2024

నెల్లూరు: నూతన ఎక్సైజ్ పాలసీ గెజిట్ విడుదల

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 182 మద్యం షాపుల లైసెన్స్ జారీకి ఎక్సైజ్ డీసీటీ శ్రీనివాసరావు గెజిట్ విడుదల చేశారు. 2024 నుంచి 2026 వరకు ప్రైవేట్ మద్యం దుకాణాలు నిర్వహించే లైసెన్సుల జారీ కోసం అక్టోబర్ 1 నుంచి 9 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. 11వ తేదీ కస్తూర్బా కళాక్షేత్రంలో డ్రా తీస్తామన్నారు. అప్లికేషన్ ఫీజు రూ.2 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

News October 1, 2024

నెల్లూరు: ఆరేళ్ల బాలికపై కన్నతండ్రి అఘాయిత్యం

image

నెల్లూరు జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అల్లూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన గోడ.వెంకటరమణయ్య తన ఆరేళ్ల కూతురుపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాలిక భయపడి కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.