News May 31, 2024
కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న డీకే అరుణ

వారణాసిలో కొలువుదీరిన కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ శుక్రవారం దర్శించుకున్నారు. ప్రధాని మోదీకి మద్దతుగా వారణాసిలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వెళ్లిన డీకే అరుణ ప్రచారాన్ని ముగించుకొని తిరుగు ప్రయాణంలో కాశీ విశ్వనాథని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Similar News
News May 7, 2025
MBNR: ‘ఒప్పంద అధ్యాపకులకు న్యాయం చేయాలి’

పాలమూరు యూనివర్సిటీలోని నిరవధిక సమ్మె చేస్తున్న ఒప్పంద అధ్యాపకులను మహబూబ్‌గర్ ఎంపీ డీకే అరుణ దీక్షా శిబిరానికి చేరుకొని సంఘీభావం తెలిపారు. శనివారం ఎంపీ మాట్లాడుతూ.. ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణ, సమస్యల సాధనకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,యూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకులు పాల్గొన్నారు.
News May 7, 2025
BREAKING.. గద్వాలలో భర్తను చంపిన భార్య

గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. పోలీసుల వివరాలు.. కేటీదొడ్డ మండలం బసాపురం శివారులో భర్తను తన భార్య పద్మమ్మ ప్రియుడుతో కలిసి చంపింది. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరికి మరో ఇద్దరు సహాయం చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News May 7, 2025
MBNR: నూతన విద్యుత్ సబ్ స్టేషన్‌కు ఎమ్మెల్యే భూమి పూజ

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల సమీపంలో రు.3.29 కోట్లతో నూతనంగా నిర్మించిన విద్యుత్తు సబ్ స్టేషన్‌కు ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి శనివారం భూమి పూజ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే మహబూబ్‌నగర్ పట్టణంలోని కొన్ని ప్రాంతాలు, వివిధ గ్రామాల్లో కరెంటు సమస్య తీరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.