News April 15, 2024
కాసిపేట: రైలులో ప్రయాణిస్తూ మహిళ మృతి

కడప జిల్లాకు చెందిన మంటింటి లక్ష్మీదేవి (36) రైలులో ప్రయాణిస్తూ మృతి చెందినట్లు మంచిర్యాల జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్ తెలిపారు. గత కొద్దిరోజులు అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను బెల్లంపల్లి మండలం సోమగూడెంలోని కల్వరి చర్చికి తీసుకొచ్చారు. ప్రార్థనల్లో పాల్గొన్న లక్ష్మీదేవి తిరిగి రైలులో వెళ్తుండగా తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు పేర్కొన్నారు.
Similar News
News March 5, 2025
ఆదిలాబాద్: పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా కొసాగాయి. తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా వాతావరణంలో ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగానే విద్యార్థి కళాశాల, ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాలను బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం, సీసీ కెమెరాలను పరిశీలించారు.
News March 5, 2025
ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో బుధవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,900గా నిర్ణయించారు. మంగళవారం ధరతో పోలిస్తే బుధవారం సీసీఐ ధరలో మార్పు లేదు. ప్రైవేట్ పత్తి ధరలో సైతం ఎటువంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.
News March 5, 2025
ADB: ముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

ఉమ్మడి KNR, ADB, NZB, MDK ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో భాగంగా 11వ రౌండ్‌తో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. 11వ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 4,935 (75,675), కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 4,387 (70,565), బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 3,473(60,419) ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బీజేపీ అభ్యర్థి 5,110 లీడింగ్‌లో కొనసాగుతున్నారు.