News May 6, 2024
కాసేపట్లో అనకాపల్లి చేరుకోనున్న మోదీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి జిల్లా కాశింపేట మండలం తాళ్లపాలెంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు ప్రధాని మోదీ కాసేపట్లో రానున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సైతం హాజరు కానున్నారు. కాగా కూటమి నాయకులు ఇప్పటికే అనకాపల్లి సభాస్థలి వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు.
Similar News
News January 24, 2025
మోసపూరిత ప్యాకేజీలతో మోసం చేయోద్దు: శైలజానాథ్
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న దీక్షా శిబిరాన్ని పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ శుక్రవారం సందర్శించారు. శిబరంలో కూర్చుని కార్మికులతో చర్చించారు. ప్రకటించిన ప్యాకేజీ ఏ మేరకు లబ్ది చేకూరుతుంది.. ఎలాంటి అంశాలు అవసరమో అడిగి తెలుసుకున్నారు. మోసపూరిత ప్యాకేజీలతో స్టీల్ ప్లాంట్‌కు అన్యాయం చేయొద్దని అన్నారు. సెయిల్‌లో విలీనం చేసి గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
News January 24, 2025
శకటంలో 30కి పైగా ఏటికొప్పాక బొమ్మలు
ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు ఏటికొప్పాక లక్కబొమ్మల శకటం ఎంపికైన సంగతి తెలిసిందే. ఏటికొప్పాకకు చెందిన కళాకారుడు గోర్స సంతోశ్ తయారుచేసిన ఈ శకటంలో 30కి పైగా లక్క బొమ్మలు ఉంటాయి. వీటిలో వెంకటేశ్వర స్వామి, వినాయకుడుతో పాటు తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిభింబించే లక్క బొమ్మలు ఉంటాయని సంతోశ్ తెలిపారు. NOTE: పైనున్న ఫొటోలో నమూనాను చూడొచ్చు.
News January 24, 2025
విశాఖలో కిడ్నాప్ కలకలం
విశాఖలో కిడ్నాప్ కలకలం రేపింది. ఓ యువతి పెద్దపాలెం చెందిన రామారావు అనే వ్యక్తికి పలుమార్లు ఫోన్ చేసి ట్రాప్ చేసింది. తగరపువలస సమీపంలో గుడి వద్దకు రావాలని చెప్పడంతో ఆయన వెళ్ళగా నలుగురు యువకులు కిడ్నాప్ చేసి ATM కార్డు, రూ.48,000 నగదు దోపిడీ చేశారు. ఏటీఎంలో రూ.7వేలు డ్రా చేయడంతో రామారావు మోసపోయినట్లు గ్రహించి భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ట్రాప్ చేసిన యువతి ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నారు.