News February 22, 2025
కీసరగుట్ట జాతర.. 2,000 మందితో బందోబస్తు!

కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల కోసం కట్టుదిట్టంగా భద్రతను చేపడుతున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సుమారు 2,000 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు CP పేర్కొన్నారు. ఆలయం వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
Similar News
News February 23, 2025
తుర్కయంజాల్: అసభ్యకరంగా యువత ప్రవర్తన.!

హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే రహదారిలో తుర్కయంజాల్ మాసాబ్ చెరువు దగ్గర కొంత మంది యువతీ యువకులు అసభ్యకరమైన ప్రవర్తన చేస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. ఫామిలీతో పాటు అక్కడికి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని పలువురు వాపోతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో కూడా ఒక వీడియో చెక్కర్లు కొడుతోంది. అధికారులు స్పందించి యువత ఇక్కడ ఇలాంటి అసభ్యకరమైన పనులు చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
News February 23, 2025
యాచారం: మహిళపై అత్యాచారం.. యువకుడికి రిమాండ్

మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడిన యువకుడిని శనివారం యాచారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. యాచారం మండల పరిధిలోని మాల్‌లో ఉంటున్న మతిస్థిమితంలేని మహిళపై నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం ఎరుగండ్లపల్లికి చెందిన పోలే శ్రీశైలం (25) అనే యువకుడు గత డిసెంబర్ 9న అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితుని గుర్తించి రిమాండ్‌కు తరలించారు.
News February 22, 2025
HYD: చందానగర్‌లో దారుణ హత్య

చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. స్థానికుల వివరాలు.. గోపినగర్‌కు చెందిన ఫక్రుద్దీన్, నజీర్ స్నేహితులు. రాత్రి 8 గంటల సమయంలో మాట్లాడే పని ఉందని స్నేహితులు గోపిచెరువు వద్దకు నజీర్‌ను తీసుకెళ్లారు. అక్కడ గొడవ జరగింది. ఫక్రుద్దీన్ దాడిలో నజీర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.