News February 17, 2025

కుంభమేళాకి వెళ్లి తాడిపత్రి మహిళ మృతి

image

అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన భక్తులు మహా కుంభమేళాకు వెళ్లిన బస్సు వారణాశికి సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. చేనేత కాలనీకి చెందిన నాగలక్ష్మి అనే మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. మిగతా 6 మందికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అయితే యాత్రకు వెళ్లిన కొంతమంది ఫోన్లు పనిచేయకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు.

Similar News

News December 15, 2025

అన్నమయ్య జిల్లాలో మరికొందరు సీఐల బదిలీ

image

అన్నమయ్య జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. డి.రామాంజనేయుడును అన్నమయ్య SC, ST సెల్ నుంచి ప్రొద్దుటూరు త్రీటౌన్‌కు బదిలీ చేశారు. టి.మధును అనంతపురం రేంజ్ సర్కిల్ నుంచి DPTC అన్నమయ్యకు, అక్కడ ఉన్న . ఆదినారాయణ రెడ్డిని DCRB, అన్నమయ్యకు బదిలీ చేశారు. ఎం.తులసి రామ్‌ను DCRB నుంచి వీఆర్‌కు పంపారు.

News December 15, 2025

WGL: రెండో విడత జీపీ ఎన్నికల్లో పార్టీల వారీగా గెలుపులు!

image

ఉమ్మడి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం సాగింది. మొత్తం 563 జీపీల్లో 332 స్థానాల్లో కాంగ్రెస్, 181లో BRS, 9 బీజేపీ, 41 చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు. జిల్లాల వారీగా HNK కాంగ్రెస్ 39, బీఆర్‌ఎస్ 22, WGL కాంగ్రెస్ 70, బీఆర్‌ఎస్ 40, JNG కాంగ్రెస్ 26, బీఆర్ఎస్ 38, BHPL కాంగ్రెస్ 46, బీఆర్ఎస్ 30, MLG కాంగ్రెస్ 36, BRS 13, MHBD కాంగ్రెస్ 115, BRS 38 స్థానాలు గెలిచాయి.

News December 15, 2025

కర్నూలు రేంజ్ పరిధిలో 31 మంది సీఐల బదిలీ

image

కర్నూలు రేంజ్ పరిధిలోని 31 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 18 మంది సీఐలకు స్థానచలనం కల్పించారు. పరిపాలన సౌలభ్యం, సమర్థవంతమైన పోలీస్ వ్యవస్థ నిర్వహణ దృష్ట్యా ఈ బదిలీలు చేపట్టినట్లు డీఐజీ తెలిపారు.