News February 7, 2025
కుంభాభిషేకం ముగింపు కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్
కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలో మహా కుంభాభిషేక మహోత్సవాలు రంగ రంగ వైభవంగా ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కాళేశ్వర దేవస్థానంలో శుక్రవారం జిల్లా కలెక్టర్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ పర్యటించారు. ఈనెల 9న మహా కుంభాభిషేకం ముగింపు కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని రద్దీకి తగినట్లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
Similar News
News February 7, 2025
నల్గొండ: ఉచిత శిక్షణ.. ఆపై ఉద్యోగం
స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో నిరుద్యోగ యువతీయువకులకు ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగం కల్పిస్తామని సంస్థ డైరెక్టర్ లక్ష్మీ ఓ ప్రకటనలో తెలిపారు. అకౌంట్స్ అసిస్టెంట్ (ట్యాలీ), కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్, ఆటోమొబైల్, టూ-వీలర్ సర్వీసింగ్, సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్, సోలార్ సిస్టం ఇన్స్టాలేషన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవచ్చని కోరారు.
News February 7, 2025
నల్గొండ: 13 మంది 16 సెట్ల నామినేషన్లు..
వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం 13 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లను దాఖలు చేసినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించినట్లు పేర్కొన్నారు.