News May 8, 2024
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ (Rewind)
1962 నాటికి రాజోలు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. అప్పుడు గడ్డం మహలక్ష్మి 30,460 ఓట్లతో కాంగ్రెస్ MLA గా గెలిచారు. అదే సమయంలో పక్క నియోజకవర్గం నగరంలో మామిడికుదురుకు చెందిన నయినాల గణేశ్వరరావు కూడా విజయం సాధించారు. 1967 ఎన్నికల్లో రాజోలు జనరల్‌గా, నగరం ఎస్సీ నియోజకవర్గంగా మారిపోయాయి. దీంతో మహాలక్ష్మిని నగరం నుంచి, గణేశ్వరరావును రాజోలు నుంచి కాంగ్రెస్ బరిలో దింపగా.. అప్పుడూ ఇద్దరు గెలిచారు.
Similar News
News November 5, 2024
ఐ.పోలవరం: విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. టీచర్ అరెస్ట్
ఐ.పోలవరం హైస్కూల్లో విద్యార్థినుల పట్ల మ్యాథ్స్ టీచర్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ హాస్టల్ వార్డెన్ చేసిన ఫిర్యాదుపై మంగళవారం SI మల్లికార్జున రెడ్డి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తనపై వార్డెన్ విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఇదే ఆరోపణలపై టీచర్ రెండుసార్లు సస్పెండ్ అయ్యారు.
News November 5, 2024
మంత్రి అచ్చెన్నాయుడిని కలిసిన బీజేపీ నేతలు
డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమలాపురం వచ్చిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు అమలాపురంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో ఘనంగా సత్కరించి పూల బొకే అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.
News November 5, 2024
రాజోలు: వృద్ధుడి హత్య.. బంగారం, నగదు చోరీ
రాజోలు మండలం పొన్నమండ గ్రామంలో జగ్గారావు (93)ని హత్య చేసి ఇంట్లోని 22 గ్రాములు బంగారం, రూ.40 వేలు నగదు చోరీ చేశారని మృతుని మనవడు శ్రీకాంత్ ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని సీఐ నరేశ్ కుమార్ తెలిపారు. అదే గ్రామానికి చెందిన సందీప్ హత్యకు పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు. మృతుడి ఇంట్లో దొంగతనం కేసులో సందీప్ జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడని, ఆ కక్షతో వృద్ధుడిని హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు.