News March 18, 2025

కుబీర్: కరెంట్ షాక్‌తో రైతు మృతి

image

ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ వివరాల ప్రకారం.. సిర్పెల్లి(H) గ్రామానికి చెందిన పబ్బు గణేశ్(48) సోమవారం వ్యవసాయ భూమిలో మొక్కజొన్నకు నీరు ఇవ్వడానికి వెళ్లాడు. ఇంటికి రాలేదని తన కుమారుడు వెళ్లి చూడగా కరెంట్ షాక్‌కు గురై గణేశ్ విగతజీవిగా పడి ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.

Similar News

News March 19, 2025

లక్షెట్టిపేట: ‘వసంత అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు’

image

లక్షెట్టిపేట పట్టణంలో కొత్తశ్యామల మెడలో బంగారు గొలుసును దొంగిలించిన నిందితురాలు సముద్రాల వసంతను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండుకు పంపామని సీఐ అల్లం నరేందర్, ఎస్సై సతీష్ తెలిపారు.16న శ్యామల ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వసంత ప్లాన్ ప్రకారం శ్యామల మెడలోని సుమారు 3 తులాల పుస్తెలతాడును దొంగలించి పారిపోయిందన్నారు. శ్యామల ఫిర్యాదు మేరకు వసంతను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామని వారు తెలిపారు.

News March 19, 2025

అచ్చంపేట: అర్హత లేని ఇద్దరు డాక్టర్లపై కేసు నమోదు

image

అచ్చంపేట పట్టణంలోని రెండు ప్రైవేట్ ఆసుపత్రులపై రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని రెండు ప్రైవేటు ఆసుపత్రిలో ఎలాంటి అర్హత లేని ఇద్దరు వైద్యులు చికిత్స అందిస్తుండగా వారిపై కేసు నమోదు చేసినట్లు అచ్చంపేట పోలీసులు తెలిపారు. సాయి క్లినిక్‌లో నరేందర్, కావేరి పాళీ క్లినిక్‌లో లింగాచారి ఎంబీబీఎస్ అర్హత లేకుండా రోగులకు వైద్యం చేస్తున్నారని చెప్పారు.

News March 19, 2025

నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడి నేపథ్యం ఇదే..!

image

నాగర్‌కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా వేముల నరేందర్ రావును అధిష్ఠానం నియమించిన విషయం తెలిసిందే. ఉప్పునుంతల మండలం పెద్దాపూర్‌కు చెందిన నరేందర్ విద్యార్థి దశ నుంచి నాయకత్వ పటిమను ప్రదర్శిస్తూ ఏబీవీపీ విద్యార్థి సంఘంలో చురుకైన పాత్ర పోషించారు. అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తూనే పార్టీలో కార్యకర్తగా చేరారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేశారు.

error: Content is protected !!