News June 5, 2024
కురుపాంలో 30 ఏళ్ల తర్వాత ఎగిరిన టీడీపీ జెండా
తోయక జగదీశ్వరీ విజయంతో కురుపాం కోటపై 30 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగిరింది. టీడీపీ నేతల కృషితో పాటు పుష్పశ్రీవాణి ఉన్న వ్యతిరేకతను తమ అనుకూలంగా మలచుకోవడంలో కూటమి నేతలు సక్సెస్ అయ్యారు. గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండకు చెందిన జగదీశ్వరీ ఎల్విన్ పేట MPTCగా ఉన్నారు. ఆర్థిక బలం లేకపోయినా చంద్రబాబు మన్ననలు, కూటమి సపోర్ట్, చివర్లో మాజీ ఎంపీ ప్రదీప్ దేవ్ కొడుకు వీరేశ్ చంద్రదేవ్ అండతో గెలుపొందారు.
Similar News
News November 28, 2024
బలిజిపేట: వ్యక్తి సూసైడ్.. అప్పుల భారమే కారణం
బలిజిపేట మండలం గంగాపురంలో అప్పుల భారంతో వ్యక్తి సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై సింహాచలం వివరాల ప్రకారం.. ఇటుక బట్టీ నిర్వహిస్తున్న రవి అప్పులు ఎక్కువగా చేశాడు. వీటిని సమయానికి తీర్చలేక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స కోసం విజయనగరం తరలించగా బుధవారం మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 28, 2024
విజయనగరం జిల్లాకు DIG గోపీనాధ్ జెట్టీ రాక
విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టీ జిల్లాలో గురువారం పర్యటించనున్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో పోలీసు ఉద్యోగులకు వార్షిక క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. ఈ క్రీడా పోటీలను డీఐజీ గోపీనాథ్ జట్టి గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభించనున్నారు. కాగా ఈ పోటీలు ఈ నెల 30 వరుకు కొనసాగనున్నాయి.
News November 27, 2024
పంచగ్రామాల సమస్య.. అశోక్‌తో విశాఖ ఎమ్మెల్యేలు భేటీ
కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సింహాచల దేవస్థానం పంచ గ్రామాల భూముల క్రమబద్దీకరణపై అశోక్ తో చర్చించారు. విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణ బాబు, పంచకర్ల రమేష్, తదితరులు అశోక్ ను కలిసిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.