News March 21, 2025
కుల, మత విద్వేషాలను రెచ్చగొడితే కఠిన చర్యలు: ఎస్పీ

కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. రానున్న ఉగాది, రంజాన్ పండుగ సందర్భంగా కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టే వారిపై నిరంతరం సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొడితే పోస్టులు పెడితే కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు.
Similar News
News March 24, 2025
BREAKING: నల్గొండ జిల్లాలో భారీ చోరీ

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి వాసవి బజారులో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుంగడులు ఓ ఇంట్లో చొరబడి 30 తులాల బంగారం, రూ.5 లక్షల నగదును దోచుకెళ్లారు. గుర్తించిన బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News March 24, 2025
నల్గొండ: వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. వివరాలిలా.. HYDకి చెందిన ఉదయ్‌కిరణ్ నేరేడుగొమ్ము మండలం పుష్కర ఘాట్‌లో మునిగి చనిపోయాడు. నల్గొండ మండలానికి చెందిన నవీన్ కుమార్, రాఘవేంద్ర ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందారు. సూర్యాపేట జిల్లాలోని బీబీగూడెంలో కారు, బస్సు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు.
News March 24, 2025
నల్గొండ: లాడ్జిలో వ్యక్తి మృతదేహం లభ్యం

నల్గొండ పట్టణంలోని రూపా లాడ్జిలో గుర్తుతెలియని వ్యక్తి(35) డెడ్ బాడీని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇతడు విజయవాడ ఫైర్ వర్క్స్‌లో పనిచేస్తున్నట్లు లాడ్జి రికార్డ్స్‌లో ఉందని నల్గొండ టూ టౌన్ పీఎస్ SI సైదులు తెలిపారు. మృతుడిని నవీన్‌గా గుర్తించామన్నారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే 87126 70176 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.