News April 1, 2025
కూకట్‌పల్లిలో EPFO శిబిరాల నిర్వహణ

ఈపీఎఫ్‌ఓ రీజినల్ ఆఫీస్ (RO) కూకట్‌పల్లిలో HYD, RR, MDCL జిల్లాల్లో నిధి అప్కే నికట్ 2.0 శిబిరాలను విజయవంతంగా నిర్వహించింది. ఈ శిబిరాల ద్వారా కార్మికులు, నియోగదారులకు ఉద్యోగి భవిష్యనిధి (EPF) సేవలను సులభంగా అందించడమే లక్ష్యంగా పేర్కొంది. EPF ఖాతాలను అప్‌డేట్ చేయడం, పిన్ సమస్యలను పరిష్కరించడం, వివరాలను సమర్పించడం వంటి సేవలు అందిస్తూ, ప్రజలకు EPFO సేవలు సులభతరం చేసింది.
Similar News
News December 18, 2025
ADB: UPSCలో సత్తా చాటిన జిల్లా యువకుడు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)లో ఆదిలాబాద్ జిల్లా యువకుడు నోముల సాయి కిరణ్ 82వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన నోముల అనసూయ-గంగన్నల కుమారుడు సాయి కిరణ్ ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (IES) సాధించాడు. పలువురు సాయి కిరణ్‌కు అభినందిస్తున్నారు.
News December 18, 2025
ఫలితాలు విడుదల

TG: గ్రూప్-3 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 1,370 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు తెలిపింది. అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇటీవల సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఒక పోస్ట్ వెరిఫికేషన్ కోసం పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. మరో 17 పోస్టుల వివరాలు త్వరలో వెల్లడిస్తామంది. లిస్ట్ కోసం ఇక్కడ <
News December 18, 2025
మెదక్ జిల్లాలో మొత్తం పోలింగ్ 89.30 %

మెదక్ జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 89.30 % పోలింగ్ నమోదైంది. 21 మండలాలు, 492 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా.. మొత్తం 4,98,152 మంది ఓటర్లకు 4,44,842 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 2,39,339లో 2,15,602 మంది, మహిళలు 2,58,806లో 2,29,235 మంది, ఇతరులు ఏడుగురిలో 5 మంది ఓటు వేశారు.


