News January 1, 2025

కూర్మావతారంలో భద్రాద్రి రామయ్య

image

భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా బుధవారం శ్రీరామచంద్రుడు కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకు ముందు స్వామివారిని కూర్మావతారంలో అలంకరించి ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించి నిత్యకళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. పూజా కార్యక్రమాల అనంతరం వేదపండితులు స్వామివారికి వేద విన్నపాలు సమర్పించారు. ఈకార్యక్రమంలో ఈవో రమాదేవి పాల్గొన్నారు.

Similar News

News January 6, 2025

ALERT.. KMM: మాంజాతో గొంతులు తెగుతున్నాయ్!

image

సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఆకాశంలో గాలిపటాలు ఎగురుతుంటాయ్. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎగరవేస్తుంటారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొందరు కైట్స్ ఎగరవేయడానికి చైనా మాంజా వాడుతుండటంతో రోడ్లపై వెళ్లే వారికి అవి ప్రమాదకరంగా మారాయి. గతంలో చైనా మాంజాతో గొంతులు తెగి ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా కొత్తగూడెంలో ఓ వ్యక్తికి మాంజా తగిలి గొంతుకు గాయమైన విషయం తెలిసిందే.

News January 6, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే పర్యటన ∆} వివిధ శాఖల అధికారులతో ఉమ్మడి జిల్లా కలెక్టర్ల సమీక్ష సమావేశం ∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇంటి సర్వే ∆} అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పర్యటన ∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News January 6, 2025

ఖమ్మం: రూ.10 కట్టి సర్పంచ్‌‌‌‌‌‌‌‌గా పోటీ: KA పాల్‌‌‌‌‌‌‌‌

image

సర్పంచ్ అభ్యర్థులకు ప్రజాశాంతిపార్టీ అధినేత KAపాల్‌‌‌‌‌‌‌‌ బంఫర్ ఆఫర్ ప్రకటించారు. టెన్త్‌ పాసై, రూ.10తో సభ్యత్వం పొందిన ఎవరైనా వచ్చే స్థానికఎన్నికల్లో తమ పార్టీ మద్దతుతో సర్పంచ్‌‌‌‌‌‌‌‌గా పోటీ చేయవచ్చన్నారు. శనివారం ఖమ్మంలో మాట్లాడుతూ.. తమ పార్టీ మద్దతుతో సర్పంచులు గెలిచిన గ్రామాల్లో 100రోజుల్లోనే ఉచిత విద్య,వైద్యం అందిస్తామన్నారు. జిల్లాను అభివృద్ధి చేయలేని భట్టి విక్రమార్క రాజీనామా చేయాలన్నారు.