News March 16, 2025
కృష్ణ: నేడు మంత్రి రాక.. భారీ బందోబస్తు సిద్ధం

మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ముడుమాల్ గ్రామంలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాతి పొందిన నిలువురాళ్ళను సందర్శించడానికి ఆదివారం కృష్ణ మండలం ముడుమాల్ గ్రామానికి రానున్నట్లు మక్తల్ సీఐ రామ్ లాల్ తెలిపారు. శనివారం కృష్ణ మండలం పరిధిలోని ముడుమల్ నిలువురాళ్లు సీఐ సందర్శించి మంత్రి రాకకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News March 16, 2025
పార్వతీపురం: ‘పొట్టి శ్రీరాములు జీవితం చిరస్మరణీయం’

అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం చిరస్మరణీయమని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఎ. శ్యాం ప్రసాద్ అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో BC సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి చిత్రపటానికి పూలమాలలు వేశారు.
News March 16, 2025
వరంగల్ మార్కెట్ రేపు పునః ప్రారంభం

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పునః ప్రారంభం కానుంది. శుక్రవారం హోలీ సందర్భంగా మార్కెట్ బంద్ ఉంది. నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
News March 16, 2025
10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేశాం: DEO

10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు తెలిపారు. అనంతపురం జిల్లాలో 135 కేంద్రాల్లో 32,803 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు బాగా రాయాలని సూచించారు.