News June 26, 2024
కృష్ణా: 233 కి.మీ. మేర పూర్తైన 3వ రైల్వే లైన్ పనులు

విజయవాడ-గూడూరు మధ్య నిర్మిస్తున్న 3వ రైల్వే లైన్ పనులు 233 కి.మీ. మేర పూర్తయ్యాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. 288 కి.మీ. మేర నిర్మిస్తున్న ఈ లైన్‌లో పలు చోట్ల వంతెనలు నిర్మించామని రైల్వే మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఈ లైన్ పనులు పూర్తై అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో వాణిజ్యం ఊపందుకోవడంతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు, దక్షిణాది రాష్ట్రాలతో మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.
Similar News
News December 18, 2025
కృష్ణా: 22కి ఉద్యోగుల గ్రీవెన్స్ మార్పు- కలెక్టర్

జిల్లా కలెక్టరేట్‌లో ఈనెల 19న జరగాల్సిన ఉద్యోగుల గ్రీవెన్స్ సమావేశం 22వ తేదీకి వాయిదా పడిందని కలెక్టర్ డి.కె. బాలాజీ తెలిపారు. అధికారిక కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల వినతులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశానికి పూర్తి నివేదికలతో హాజరుకావాలని ఆయన ఆదేశించారు.
News December 18, 2025
రేపు కృష్ణా జిల్లా సమీక్షా మండలి సమావేశం

ఈనెల 19వ తేదీన కృష్ణా జిల్లా సమీక్షా మండలి సమావేశం నిర్వహించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ అధ్యక్షతన ప్రారంభమవుతుందన్నారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారు.
News December 18, 2025
గన్నవరంలో విమానాలు ల్యాండింగ్‌కి అంతరాయం

గన్నవరంలో గురువారం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఈ ప్రభావంతో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో విమానాల ల్యాండింగ్‌కు ఆటంకం ఏర్పడింది. బెంగళూరు నుంచి గన్నవరం చేరాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం రన్‌వే క్లియరెన్స్ లేక గాల్లో చక్కర్లు కొట్టింది. పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాతావరణం మెరుగుపడిన తర్వాతే ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.


