News December 1, 2024
కృష్ణా: MBA రెండో సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో సెప్టెంబర్- 2024లో నిర్వహించిన MBA(హాస్పిటల్ మేనేజ్‌మెంట్ )కోర్సుల 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం తెలిపింది.
Similar News
News March 14, 2025
MTM: గవర్నర్‌ని కలిసి కృష్ణా విశ్వవిద్యాలయం VC

కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. రాంజీ రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయాల కులపతి అబ్దుల్ నజీర్‌ను రాజ్ భవన్‌లో శుక్రవారం కలిశారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం నిర్వహణకు గవర్నర్ నుంచి అనుమతి కోరారు.
News March 14, 2025
కృష్ణా: రేపు జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు

కృష్ణాజిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను ఈనెల 15వ తేదీన నిర్వహించనున్నట్టు సీఈఓ కన్నమ నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 7 స్థాయీ సంఘ సమావేశాలు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక, ఆయా స్థాయీ సంఘ ఛైర్మన్ల అధ్యక్షతన మచిలీపట్నంలోని జడ్పీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి జరుగుతాయని తెలిపారు.
News March 14, 2025
కృష్ణా: హోలీ సందర్భంగా ఎస్పీ హెచ్చరిక

ఎస్పీ ఆర్. గంగాధరరావు ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆహ్లాదకర వాతావరణంలో పండుగ జరుపుకోవాలన్నారు. హోలీని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ప్రజా జీవనానికి అంతరాయం కలిగించినా, బహిరంగ ప్రదేశాలలో రంగులు చల్లి ఇతరులకు ఇబ్బంది కలిగించినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.